మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్.. కార్తీకదీపం సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సీరియల్ తెలుగు నాట విపరీతమైన ఆదరణ దక్కించుకున్నది. ఇక వంటలక్క పాత్ర చేసిన ప్రేమికి ఎందరో అభిమానులయ్యారు. ఆమె నటనకు ఫిదా అయ్యారు. దీంతో కార్తీకదీపం సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్నది. వంటలక్క అంటే తెలియని తెలుగు వారుండరేమో.. అయితే బుల్లితెర ద్వారా పలువురికి సినిమాల్లో అవకాశాలు వస్తుండటం చూస్తూనే ఉంటాం.
గతంలో ప్రేమికి పలుమార్లు సినిమా చాన్స్‌లు వచ్చినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. అందుకు కారణం నటనకు ప్రాధాన్యమున్న పాత్ర లేకపోవడం. అయితే తొలిసారిగా ఓ ప్రేమి ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. రామ్ పోతినేని హీరోగా.. తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ మాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు ప్రేమిని సంప్రదించిందట చిత్ర యూనిట్.పాత్ర నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉన్నది. ప్రేమికి తెలుగు నాట ఎంతో పాపులారిటీ ఉంది. ఆమె ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఈ సినిమాలో ప్రేమి ఎటువంటి పాత్ర చేయబోతున్నదో వేచి చూడాలి.
Also Read
మరో స్టార్ హీరోయిన్ ని పట్టేసిన నితిన్..!