కృషి ఉంటే మనుషులు ఎతంటి విజయాన్నైనా సాధిస్తారు. పట్టుదల ,కృషి,దృఢమైన సంకల్పం ముందు పేదరికమైనా బలాదూర్ అవ్వాల్సిందే. ఆర్థిక కష్టాలు, సంక్షోభం ఉన్నా నిరంతరం కృషి చేస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరు. కష్టం నీ ఆయుధమైతే.. విజయం నీభానిస అవుతుందనే సత్యాన్ని నిరూపించింది ఒ టీకొట్టు అమ్ముకొని జీవించే సాధారన పేద కూతురు. తండ్రి టీ అమ్మిన కోర్టులోనే జడ్జిగా వెల్లందంటే అది ఆమె దృఢసంకల్పానికి నిదర్శనం.
వివిరాల్లోకి వెల్తే అతను కో్ర్టులో చాయ్ అమ్ముకొనీ జీవించే ఒ సాధారన పేదవాడు. సురేందర్ కుమార్ పంజాబ్ రాష్ట్రంలోని నకోదార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టులో చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాను చదువుకోకపోయినా తన కూతురికి మంచిభవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు.కోర్టులో చాయ్ అమ్ముకుంటున్న అతను ప్రతి రోజూ జడ్జీలను చూసేవాడు. తన కూతురిని కూడా జడ్జీని చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఎంత కష్టాన్నైనా భరించాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా భరించాడు. కష్టమైనా చేసి తన కూతురు ఉన్నత చదువులు చదివించాడు. తన తండ్రి కష్టాన్ని వృథాచేయలేదు కూతురు.తండ్రి ఆర్థిక ఇబ్బందులు గమనించిన శృతి కూడా పట్టుదలగా చదివింది. చివరకు అనుకున్నది సాధించింది.తండ్రి టీ అమ్మిన కోర్టుకే జడ్జిగా వెల్లడంతో తన తండ్రి ఆనందానికి అవధుల్లేవ్. అందరూ డాటరాఫ్ చాయ్ వాలా అని సమాజానికి చాటిచెప్పింది. తండ్రి ఆశయాలకు అనుగునంగా పట్టుదలతో చదివింది.
పంజాబ్ స్టేట్ పబ్లిక్ స్కూల్ పరీక్షల తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. తన తండ్రి ఆశయాలను సాధించాలన్న తపనతో న్యాయవ్యవస్థలో స్థిర పడాలనుకుంది. ఇందుకోసం యూనివర్సిటీలోనే ఉంటూ రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడింది. ఆమెకు కృషికి ప్రతిఫలంగా పంజాబ్ సివిల్ సర్వీసేస్ (జ్యూడిషియల్) పరీక్షల్లో ఎస్సీ కేటగిరీలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిది. శృతి మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంకు సాధించడం విశేషం. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన శృతికి జ్యూడిషియల్ అకాడమీలో ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చారు. తండ్రి చాయ్ అమ్ముతున్న కోర్టుకే జడ్జీగా శృతిని నియమించారు. న్యాయమూర్తి అవ్వాలని కలలుకన్నా ఆ తండ్రి తను చాయ్ అమ్ముతున్న కోర్టుకే శృతి న్యాయమూర్తిగా వస్తుందని అతను ఎన్నడూ ఊహించలేదు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన శృతిని వివిధ పార్టీనాయకులు ఆమెను ఘనంగా సత్కరించారు. పట్టుదల,కృషి ఉంటే ఎంతటి ఆర్థిక ఇబ్బందులనైనా ఎదుర్కొని శృతి సాధించిన విజయం అందరికీ ఆదర్శంకావాలి.
Related
