Monday, April 29, 2024
- Advertisement -

అసెంబ్లీ నియేజ‌క‌వ‌ర్గాల‌పెంపుపై తెలుగు రాష్ట్రాల‌కు షాక్‌ పెంపుయేచన లేద‌న్న కేంద్రం

- Advertisement -
ap assembly

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం మ‌రో జుల‌క్ ఇచ్చింది. అసెంబ్లీ సీట్ల‌పెంపు ఇప్ప‌ట్లోలేద‌ని తేల్చి చెప్ప‌డంతో ఇరు రాష్ట్రాల నేత‌ల‌కు పెద్ద షాక్ అని చెప్ప‌వ‌చ్చు. నిన్న‌టి వ‌ర‌కు నియేజ‌క వ‌ర్గా పెంపుకు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయిన సంతోషంగా ఉన్న త‌రునంలో కేంద్రం ఈ విధంగా బాంబు పేల్చ‌డం చూస్తే పిరాయింపు దారుల‌కు మాత్రం ఇది ఇబ్బంది క‌లిగించే వార్తే. ఈ మేరకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి పంపిన లిఖితపూర్వక లేఖలో కేంద్రం వివరణ ఇచ్చింది.

నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగంలోని 170 అధికరణను సవరించాల్సిందేనని అటార్నీ జనరల్ కూడా అభిప్రాయపడినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారామ్ అహీర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా ఫిరాయింపుదారులను పార్టీల్లో చేర్చేసుకున్నాయి.  ఏదోక విధంగా బెదిరించో,మంత్రిప‌దువులు ఇస్తామ‌నే లాంటి ఆశ‌లు చూపించి పార్టీ పిరాయింప‌ల‌కు తెర‌లేపారు. కేంద్రం అసెంబ్లీ సీట్లు పెంచుతాద‌ని  పెట్టుకున్న ఆశ‌లు ఒక్క‌సారిగా అడియాశ ల‌య్యాయి.

ఇప్ప‌డిక ఏంచేయాలో నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇత‌ర పార్టీవాల్లు  ఇక్కడివరకు అంతా బాగానే ఉంది గానీ ప్రతిపక్ష సభ్యుల చేరిక సొంత పార్టీ నేతలకు కొత్త కష్టాలను తీసుకొచ్చింది.సీట్లు పెంచ‌క‌పోతే మాప‌నేంట‌నీ మ‌ద‌న ప‌డుతున్నారు.అంతేకాకుండా ఏపీ మంత్రి వ‌ర్గంలో పార్టీ పిరాయింపుదారుల‌కు పెద్ద‌పేట వేయ‌డంతో …. అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి.ఇన్నాల్లు పార్టీకోసం ప‌నిచేసి లాభం ఏంట‌ని ప్ర‌శ్నించుకుంటున్నారు. ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల పెంపు గనుక జరగపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

పార్టీలో నాయకుల సంఖ్య ఎక్కువైపోవడంతో ఎవరికి టికెట్లు ఇవ్వాలో తెలియ‌ని అయేమ‌య ప‌రిస్తితి. చివరకు ఇది కాస్త అలకలు, అసంతృప్తులు, రెబల్స్ పుట్టుకురావడానికి దారితీయ‌డంలో సందేహంలేదు.కేంద్రంమీద గంపెడాశ‌లు పెట్టుకున్న సీఎంల‌కు 014ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్26కు అనుగుణంగా భారత రాజ్యాంగంలోని 170వ అధికరణను సవరించనిదే ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్రం చెప్పింది. అసెంబ్లీ సీట్లును పెంచాలంటే దేశంలో 50 శాతం రాష్ట్రాలు అమోదం త‌ప్ప‌నిస‌రి.

దీంతోపాటు పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లోనూ మెజారిటీ స‌భ్యుల  అమోదం తెల‌పాల‌నీ వైవీ సుబ్బారెడ్డికి రాసిన‌లేఖ‌లో కేంద్రం తెలిపింది. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ‌లో బీజేపీకీ త‌గిన బ‌లంలేనందు 2018 వ‌ర‌కు వేచిచూడాల్సిందే.అసెంబ్లీ సీట్ల  పెంపు ఆలోచ‌న‌లేద‌నీ కేంద్రం చెప్తున్నా … ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి మరో 50స్థానాలు పెరుగుతాయని చెబుతున్నారు.

దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కమిషన్, కేంద్రం మాటను కాదని చంద్రబాబు ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై చూపించే శ్రద్ద, ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై చూపిస్తే బాగుంటుందని పలువురు అభిప్రయాపడుతున్నారు. 

Related

  1. రాజ‌కీయాల్లో కేసీఆర్ ఈ రిజ‌ర్వేష‌న్ల స్పూర్తి అమ‌లు చేస్తాడా?
  2. ప్ర‌త్యేక హోదాపై టీడీపీ ఎంపీల తీరుపై ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ణ్ స్పంద‌న‌
  3. పార్టీలో టికెట్ల  బేర‌సార‌ల లొల్లి ఏంది ప‌వ‌ణ్‌
  4. వంగవీటి పై కేసు.. మళ్లీ మొదలు అయిన రచ్చ.. ఎందుకు ఈ వివాదం..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -