పవన్ తో.. ఆది పినిశెట్టి కి గొడవ ఎందుకు..?

Aadi Bags Offer in Pawan kalyan and Trivikram Film

కొన్నిసార్లు నటుల లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. అనుకున్నవి జరుగుతాయి.. మరికొన్నిసార్లు జరగవు. అయితే.. జరిగినవి సక్సెస్ అయితే కేరీర్ అద్భుతంగా ఉంటుంది. అయితే.. అప్పటివరకు హీరోగా చాలా సినిమాలు చేసాడు సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి చిన్నకొడుకు ఆది.

కాని ఒక్కటి కూడా అద్భుతమైన హిట్ కాలేదు. దాంతో చివరకు సరైనోడు సినిమాలో విలన్ గా చేసాడు. అక్కడ నుంచి ఆదీ ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం నాని నిన్నుకోరే సినిమాలో సెకండ్ హీరోగా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మనోడు.. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాను పట్టేశాడు. త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందుతున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా ఆది కనిపిస్తాడని తెలుస్తోంది.

మొత్తానికి బన్నీ తరువాత మరో స్టార్ మెగా హీరోతో ఆది ఈ ఫీట్ చేస్తున్నాడంటే.. ఖచ్చితంగా మనోడికి విలన్ గా కెరియర్ కొత్త ఊపు అందుకున్నట్లే. అయితే కోలీవుడ్ లో హీరో గా కొన్ని సినిమాలు చేస్తున్న ఆది ఇప్పుడు.. తెలుగులో కూడా హీరోగా కొన్ని సినిమాలు చేయాలని చూస్తున్నాడట. మరి హీరోగా సక్సెస్ అవుతాడో లేక విలన్ గా సక్సెస్ అవుతాడో చూడాలి.

{youtube}LYwlxFeT4gk{/youtube}

Related

  1. పవన్ కు జనసేనా.. మరి మహేష్ బాబు కు..?
  2. పవన్ సినిమాలో చిరంజీవి అక్క పాత్ర ఇదే
  3. షాకింగ్ న్యూస్ : పవన్ మాటలకు కన్నిలు పెట్టుకున్న కోట..
  4. ఇర‌కాటంలో జ‌న‌సేన‌…. పవన్ చూపుఎటూ