Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీ సీనియ‌ర్ దేవినేని నెహ్రూ క‌న్నుమూత‌

- Advertisement -
tdp leader devineni nehru passed away

టీడీపీ సీనియ‌ర్ నేత  మాజీ మంత్రి దేవినేని నెహ్రూ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న్ని ఆస్ప‌త్రిలో చేర్పించారు.  కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్తున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన దేవినేని నెహ్రూకు … గుండెపోటు రావడంతో ఆయన్ని మళ్ళీ ఆసుపత్రికి తరలించామనీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవినేని నెహ్రూ మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేశారు   టీడీపీ మాజీ మంత్రి  దేవినేని నెహ్రూ.  22 జూన్ 1954లో  విజ‌య‌వాడ‌లో జ‌న్మించారు. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు 62 సంవ‌త్స‌రాలు.వ్య‌వ‌సాయ వృత్తినుంచి రాజ‌కీయాల్లోకి వచ్చారు.ఇప్పటికి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-96 సమయంలో ఎన్టీఆర్ కేబినెట్లోనే ఆయన విద్యాశాఖ మంత్రిగా  మంత్రిగా  ప‌నిచేశారు చేశారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గతంలో గెలిచారు. ఒకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ మధ్యనే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. దేవినేని నెహ్రూ, తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు దేవినేని అవినాష్‌ని కాంగ్రెస్‌లో వున్నప్పుడే తెరపైకి తెచ్చారు.

దేవినేని నెహ్రూ మృతిపట్ల  పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం ప్రకటించారు. నెహ్రూ ఆకస్మిక మృతి తనకు, పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు

ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసిన వెంట‌నే  పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలు ప‌లువురు నేత‌లు  కేర్ ఆసుప‌త్రివ‌ద్ద‌కు చేరుకున్నారు. నెహ్రూ మృతదేహాన్ని సాయంత్రం విజయవాడకు తరలించి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నామ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు..

Related

  1. చిత్తూరు జిల్లాలో టీడీపీకీ మ‌రోషాక్‌… వైసీపీ వైపు ఎంపీ శివ‌ప్ర‌సాద్ చూపు
  2. ప్ర‌జ‌ల‌కు మ‌రోషాక్‌ వృథాపై ట్యాక్స్‌
  3. బాలకృష్ణ తప్పిపోయాడంట.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్
  4. బాబుతో స‌మావేశ‌మైన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -