- Advertisement -

ఆఫ్గాన్‌తో వన్డే జట్టులోకి హర్షిత్!

- Advertisement -

గాయం నుండి కోలుకుని ఫిట్‌నెస్ సాధించిన హర్షిత్ రాణా….చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడో వన్డే కోసం భారత జట్టులో చేరినట్లు బిసిసిఐ అధికారులు తెలిపారు. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న రాణా…ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఎంపికకు అందుబాటులోకి వచ్చాడు.

ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి 4న సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మోకాలి గాయం కారణంగా రాణా టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దీంతో హర్షిత్ స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఈ 24 ఏళ్ల ఆటగాడు గాయం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఆడలేకపోయాడు, దీంతో ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న రాణాను….ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌లతో పాటు జపాన్‌లో జరగనున్న ఏషియన్ గేమ్స్ జట్టులోకి కూడా ఎంపిక చేశారు. అయితే చెన్నై వన్డేలో ఆడే తుది జట్టులో చోటు దక్కితే మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

మూడో వన్డే భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -