- Advertisement -

14 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్!

- Advertisement -

లిస్ట్ ఏ క్రికెట్‌లో రోహిత్ శర్మ సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయ బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 14,000 లిస్ట్ ఏ పరుగుల మార్కును దాటారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 48 పరుగులు చేశాడు.దీంతో 14,000 కంటే ఎక్కువ లిస్ట్ ఏ పరుగులు చేసిన ఐదో భారతీయ క్రికెటర్‌గా నిలిచారు.

భారత్ తరఫున లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నారు. సచిన్ ఈ ఫార్మాట్‌లో 21,999 పరుగులు చేశారు. సచిన్‌తో పాటు విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు మాత్రమే భారత్ నుంచి ఈ ఫార్మాట్‌లో 14,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇతర క్రికెటర్లు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరిన తర్వాత ఇషాన్ కిషన్ మరియు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ….224 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన భారత కెప్టెన్ గిల్ 152 పరుగులు చేయగా….ఇషాన్ కిషన్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా, అర్ధసెంచరీ పూర్తయ్యాక ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కిషన్ 79 బంతుల్లో 125 పరుగులు చేశారు. చివర్లో భారత్ తడబడిన చివరికి 402 పరుగులకు ఆలౌట్ అయింది.దీంతో వన్డేల్లో 400 కంటే ఎక్కువ పరుగులు చేసి…10 వికెట్లు కోల్పోయిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -