వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఇటీవలే అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజును ఆయన జైలులో పరామర్శించనున్నారు.
పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో జైలులో ఉన్న అప్పలరాజును కలిసి ఆయనకు మద్దతును తెలుపనున్నారు జగన్. ఈ పరామర్శ పర్యటనలో జగన్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
సీదిరి అప్పలరాజు అరెస్టును వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇది కక్షసాధింపు చర్యల్లో భాగమేనని మండిపడుతోంది. జగన్ జైలు పర్యటన నేపధ్యంలో సెంట్రల్ జైలు ప్రాంగణం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
