Saturday, April 27, 2024
- Advertisement -

శాశ్వతంగా ఉండాలంటే.. కుదరదు జగన్ సార్ ?

- Advertisement -

మన దేశం ప్రజాస్వామ్య దేశం.. ఇందులో ప్రజలతో పాటు ప్రతి వ్యవస్థ కూడా చట్టానికి లోబడే ఉండాలి. ఏ రాజకీయ నాయకుడు అందుకు అతితమేమి కాదు. ఇదే విషయం తాజాగా ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పష్టమైంది. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ( వైఎస్ఆర్ కాంగ్రెస్ ) పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఏ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు ఉండబోడని.. అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో తాను స్థాపించిన పార్టీకి తానే నియంతగా ఉండాలని చూసిన వైఎస్ జగన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి.

అయితే ఎన్నికల సంఘం నుంచి ఎదురుదెబ్బ తగలడంతో.. తాము గతంలో శాశ్వత అధ్యక్ష పదవి విషయంలో మాటమార్చే ధోరణికి తెరతీశారు వైసీపీ శ్రేణులు. తాజాగా ఈ అంశంపై వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటారని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా శాశ్వత అధ్యక్ష పదవిని జగన్ తిరష్కరించినట్లు కూడా సజ్జల చెప్పుకొచ్చారు. అయితే ప్లీనరీ సమావేశాల్లో వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఉంటారని బహిరంగ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అలా ఉండేందుకు ఎన్నికల సంఘం నుంచి ఎదురు దెబ్బ తగలడంతో వెంటనే మాట మార్చారు. అయితే మాట మార్చడం జగన్ సర్కార్ కు కొత్తేమీ కాదు అన్న సంగతి కూడా ప్రజలకు బాగా తెలుసు.

గతంలో మద్యపాన విషయంలోనూ, పోలవరం విషయంలోనూ, సీపీఎస్ రద్దు విషయంలోనూ.. జగన్ సర్కార్ ఏ స్థాయిలో మాట మార్చిందో అందరికీ తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి అధికారికంగా శాశ్వత అధ్యక్షులు లేరు.. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు అధికారికంగా ప్రకటించుకొని.. తీర ఇప్పుడు చేతులు కాలడంతో వెంటనే మాట మార్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కనీసం దేశంలోని డెమోక్రటిక్ విధానాలు కూడా జగన్ కు తెలియవా ? అంటూ కొందరు రాజకీయ అతివాదులు జగన్ వైఖరిని ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి వైసీపీ శాశ్వత అధ్యక్ష హోదాలో జగన్ అధికారికంగా అయిదేళ్ళే.. అయినప్పటికి పరోక్షంగా శాశ్వత అధ్యక్ష హోదాలో జగన్ అడుగుజాడల్లోనే పార్టీ ఉంటుందనేది జగమెరిగిన సత్యం.

Also Read : పాపం.. జూ. ఎన్టీఆర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -