- Advertisement -

తీవ్ర విషాదం.. కుటుంబం ఆత్మహత్య!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వడ్డెర సత్రంలోని రూమ్‌ నెం. 12 నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో సత్రం నిర్వాహకులు అనుమానం వచ్చి వెళ్లి చూశారు. గదిలోపల మృతదేహాలు కుళ్ళిన స్థితిలో కనిపించడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ) రామాంజనేయులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు నెల రోజుల నుంచి ఈ కుటుంబం వడ్డెరసత్రంలోనే గది అద్దెకు తీసుకుని బస చేస్తోంది. మృతులను శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు పల్లపు సుధాకర్‌ (36), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), గోగుల ఆదిలక్ష్మి (50), మణికంఠ (15)గా పోలీసులు నిర్ధారించారు.

గదిలోని హాలులో ఇద్దరు వ్యక్తులు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండగా, స్నానాల గదిలో ముగ్గురు మహిళలు విగతజీవులుగా పడి ఉన్నారు. వీరంతా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -