- Advertisement -

హైదరాబాద్ లో జగన్, వివాహ వేడుకకు హాజరు!

- Advertisement -

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వద్ద వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా సందడి నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ (పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు) కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్‌కు విచ్చేశారు.

అనంతరం బేగంపేట నుంచి భారీ కాన్వాయ్‌తో జలవిహార్‌కు వైఎస్‌ జగన్‌ బయలుదేరారు. మార్గమధ్యలోనూ, జలవిహార్ వద్ద కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేశారు. జలవిహార్‌లో ఘనంగా జరుగుతున్న వివాహ వేడుకకు చేరుకున్న వైఎస్‌ జగన్‌, నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో సందడి వాతావరణం నెలకొంది.

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నేతలు అయోధ్య రామిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నాగార్జున, పెండెం దొరబాబు, పూత్త ప్రతాపరెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -