- Advertisement -

చాలా మంచి పని: ఔరంగజేబు రోడ్డు కు అబ్దుల్ కలాం పేరు!

- Advertisement -

ఢిల్లీలో మొఘలాయి చక్రవర్తి పేర్ల మీద చాలా రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు. .ముఖ్యమైన ఆఫీసులు కొలువైన ప్రాంత రోడ్లు అన్నీ మొఘల్ చక్రవర్తుల పేర్ల మీదే ఉన్నాయి.

అక్బర్ , బాబర్…మొదలుకొని ఔరంగజేబు వరకూ అనేక మంది పేర్ల మీద రహదార్లు ఉన్నాయి. మరి అక్బర్ లాంటి వారి పేర్లమీద రోడ్లు ఉంటే సర్దుకుపోవచ్చు. అయితే ఏకంగా ఔరంగజేబు పేరు మీద కూడా రహదారి ఉండటాన్ని సహించడం కష్టమే.

ఎందుకంటే ఔరంగజేబు ఒక దుష్ట చక్రవర్తి. పరమత సహనం లేని మనిషి. తన పాలనలో దేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నించాడు. హిందూ దేవాలయాలను నాశనం చేయించాడు. ప్రజలను పీడించాడు. అలాంటి చక్రవర్తి పేరు మీదు కూడా ప్రజాస్వామ్య భారత దేశంలో ఒక రోడ్డు ఉండటం విడ్డూరమే. ఈ విడ్డూరం దశాబ్దాల పాటు కొనసాగింది. అయితే ఎట్టకేలకూ ఈ విషయంలో ఢిల్లీ మున్సిపాలిటీ స్పందించింది.

ఔరంగజేబు మీద ఉన్న రోడ్డు పేరును అబ్దుల్ కలాం పేరుకు మార్చింది. ఇకపై ఆ రోడ్డును అబ్దుల్ కలాం రహదారిగా వ్యవహరిస్తామని ప్రకటించింది. ఇది కచ్చితంగా అభినందించదగిన అంశమే. ఇటీవలే పరమపదించిన రాష్ట్రపతిని ఈ విధంగా గౌరవించుకోవడం మంచి సంప్రదాయం. ఔరంగజేబు పేరు ను ఒక రోడ్డుకు పెట్టుకోవడం కంటే.. కలాం పేరు మీదుగా ఆ రోడ్డుకు నామకరణం చేసుకొని అలా పిలుచుకోవడం చాలా మంచిది. ఈ నిర్ణయం తీసుకొన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు అభినందనలు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -