- Advertisement -

ఎవ‌రు తీసుకున్న గోతిలో వారె ప‌డ‌తారు అనేదానికి ఇదే నిద‌ర్శ‌నం…

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిలో ఒక ప‌క్క విషాదం….మ‌రో ప‌క్క సంతోషం నెల‌కొన్నాయి. ప్ర‌స్తుం బాబులో ఆనందంకంటె విషాదం నెల‌కొన్నాయి. పార్టీ ఫిరాయింపులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎవ‌రు తీసుకున్న గోతిలో వారె ప‌డ‌తార‌నె దానికి నిద‌ర్శ‌న‌మే ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప‌రిస్థితి. ఇప్పుడు ఎంచేయాలో దిక్కుతోచ‌క కొట్టుమిట్టాడుతున్నాడు. ఎందు కంటారా అస‌లు విష‌యానికి వ‌స్తా..

ఏపీలో ప్ర‌తి ప‌క్ష పార్టీనె లేకుండా చేయాల‌ని నిస్తిగ్గుగా పార్టీ ఫిరాయింపుల‌ను బాబు ప్రోత్స‌హిస్తున్నారు. కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాయ‌నె చెప్పుకోవ‌చ్చు. గ‌తంలో పిరాయింపుల‌ను వ్య‌భిచారంతో పోల్చిన నిప్పు బాబు ఇప్పుడు ఆ వ్య‌పిచారానికె లైసెన్స్ ఇచ్చారు. వైసీపీ పార్టీనుంచి ఇప్ప‌టికె 21 మంది ఎమ్మెల్యేల‌ను, ముగ్గురు ఎంపీల‌ను అనైతికంగా పార్టీలోకి చేర్చుకున్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా న‌వ్విరిపోరుదుగా నాకేమి అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించె అత్యాశ ఇంకా బాబులో తీర‌లేదు. ఎన్నిక‌ల స‌మ‌యానికి వీలైనంత మందిని పార్టీలోకి చేర్చుకోవాల‌ని నేత‌ల‌కు పిలుపునిచ్చారు. ఇంకా పిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. దీంతో బాబు సంతోషంగా ఉన్నారు. కాని తెలంగాణాలో మాత్రం ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. క‌నీసం ఏపీలో న‌న్న ప్ర‌తిప‌క్ష ఇప్ప‌టికి బ‌లంగానె ఉంది కాని తెలంగాణాలో మాత్రం పార్టీ ఆంప‌శ‌య్య‌మీద ఉంది. దీంతో బాబులో ఒక ప‌క్క విషాదం..మ‌రో ప‌క్క సంతోషం నెల‌కొన్నాయి.

తెలంగాణాలో టీడీపీలో నాయ‌కుల‌ద‌రు ఇప్ప‌టికె టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పార్టీలో మిగిలింది ముగ్గురో న‌లుగురో ఎమ్మెల్యేలు. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనె స‌త్తా ఉన్న ఒకే ఒక్క నాయ‌కుడు రేవంత్ రెడ్డి. ఆయ‌న కూడా త్వ‌ర‌లో కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు. వ‌ల‌స‌ల‌ను ఆప‌డానికి బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంలేదు. రేవంత్‌రెడ్డి పార్టీమారితె ఆయ‌న‌తో పాటు మ‌రికొంత మంది నాయ‌కులు కాంగ్రెస్ ఖండువా క‌ప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

వ‌చ్చె సార్వ‌త్రిక ఎన్నిక‌లనాటికి టీ టీడీపీ పూర్తిగా ఖాలీ అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. క‌నీసం పోటీ చేసెదానికి నాయ‌కులు దొర‌క‌ని ప‌రిస్థితి ఉంటుంద‌న‌డంలో సందేహంలేదు. ఏపీలో టీడీపీలోకి వ‌స‌లు ఊపందుకుంటె తెలంగాణాలో అందుకు విరుద్ధంగా పార్టీ ఖాలీ అవుతోంది. బాబు రెండు క‌ళ్ల సిద్ధాంతం అవ‌లంబిచ‌డంతోనె నాయ‌కులు పార్టీ మారుతున్నారు. తెలంగాణాలో అధికార‌పార్టీపై పోరాడుతుంటె….బాబేమో ఆపార్టీతో పొత్తుకు ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో నాయ‌కులు స‌హించ‌లేక వేరే పార్టీల‌వైపు చూసుకుంటున్నారు. భ‌విష్య‌త్తులో చివ‌ర‌కి పార్టీలో ఎవ‌రు మిగులుతారో చూడాలి. తెలంగాణాలో పార్టీని కాపాడుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు బాబు. అందుకె పెద్ద‌లు అన్నారు చెడ‌ప‌కురా చెడేవ‌ని.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -