- Advertisement -

చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో..

- Advertisement -

సినీ పరిశ్రమకు తాను అందించిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు. అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష అవుతుందని దానికి గౌరవం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

పద్మశ్రీ పురస్కారం తనకు రావడంలో ఆలస్యం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారని రాజేంద్రప్రసాద్ అన్నారు. అదంతా ఒక ప్రక్రియలో భాగంగా జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో తాను ఏనాడూ ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావును అడిగితే బాగుండేదని కొందరు సూచించారని చెప్పారు. కానీ అడిగి తీసుకునేది భిక్ష అని భావించి తాను ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు.

తన సినీ ప్రస్థానంలో ఎన్నో మంచి సినిమాలు తీశానని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు. విజయ చాముండేశ్వరి బ్యానర్‌పై ‘మేడమ్’ అలాగే ‘రాంబంటు’ చిత్రాలు రూపొందించానని వివరించారు. మేడమ్ సినిమాలో మహిళా పాత్రలో నటించినందుకు తనకు నంది అవార్డు రావడం వెనుక అక్కినేని నాగేశ్వరరావు కృషి ఉందని చెప్పారు. జ్యూరీ కమిటీకి ఆయనే స్వయంగా తన పేరును ప్రతిపాదించారని ఆ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రాంబంటు సినిమా తర్వాత నిర్మాణం తనకు సరిపడదని గుర్తించి అన్నపూర్ణ స్టూడియోస్ పక్కన అర ఎకరం అమ్మేశానని నిజాయితీగా చెప్పారు.

దక్షిణాది నటులకు జాతీయ స్థాయి అవార్డులు ఆలస్యంగా అందుతాయని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారో తనకు తెలియదని చెప్పారు. ప్రతి విషయాన్ని నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో చిరంజీవి అత్యున్నత స్థానంలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తనకు ఐదు తరాల నటులతో కలిసి పనిచేసే అదృష్టం దక్కిందని చెప్పారు. త్వరలోనే ‘క్విక్ గన్ మురుగన్’ సీక్వెల్స్ మూడు లేదా నాలుగు భాగాలు చేయబోతున్నానని ఆయన వెల్లడించారు. తన కోసం దర్శకులు కొత్త పాత్రలు రాయడం అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ ముగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -