- Advertisement -

బాబు పాలనలో బాధితులే..నిందితులా?

- Advertisement -

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది చంద్రబాబూ? అని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. రాజధాని ప్రాంత రైతుల అభ్యర్థన మేరకు మా పార్టీ నాయకులు అమరావతిలో పరిశీలన కోసం వెళితే.. అక్కడ మీ అవినీతి, అక్రమాలు బయటపడతాయని దాడులు చేయించావు అని ఆరోపించారు.

సరిపోదన్నట్లు బాధితులనే నిందితులుగా చూపించే ప్రయత్నమా?.. చంద్రబాబు పాలనలో RULE OF LAW పక్కకు పోయి..RULE OF FEAR రాజ్యమేలుతుంది అన్నారు. ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రజలు భయపడే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది… ప్రభుత్వం తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి గొంతు నొక్కేందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసుల్ని ప్రయోగిస్తున్నాడు అన్నారు.

రాష్ట్రంలో దిగజారిపోయిన వ్యవస్థలు అడుగడుగునా కనిపిస్తున్నాయి.. చంద్రబాబు అసమర్థ పాలనతో రాష్ట్రంలో కొత్త సంస్కృతి మొదలైంది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమకు అన్యాయం జరిగినా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడే దుస్థితిని తీసుకొచ్చారు… అమరావతి పేరు మీద ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. వాటిలోనే నిర్మాణాలు పూర్తి చేయకుండా ఇప్పుడు మళ్లీ వేల ఎకరాలు ఎందుకు ? ఎవరికోసం ? సమాధానం చెప్పు అని చంద్రబాబును ప్రశ్నించారు.

రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని.. కోర్టులతో కూడా పనిలేదని.. తమ చేతుల్లో ఉన్న కొంత మంది పోలీసుల సాయంతో ఇష్టమొచ్చినట్లు శిక్షలు వేస్తామని అధికారిక ప్రకటనను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేయగలరా అని ప్రశ్నించారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -