Sunday, May 19, 2024
- Advertisement -

జగన్ ఎంట్రీతో జంకిన చంద్రబాబు ప్రభుత్వం…!

- Advertisement -

ప్రత్యేకహోదా అంశం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ లో తలపెట్టిన సదస్సుకు రెడ్ సిగ్నల్ వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కితే జరగబోయే మేళ్లను వివరిస్తామంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ సభకు అనుమతిని నిరాకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ నెల పదిహేనో తేదీన జరగనున్న ఈ సభకు అనుమతి లేదని స్వయంగా రాష్ట్ర మంతి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశాడు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరమైన టర్న్ తీసుకొంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. హోదా ఆవశ్యకతను వివరిస్తూ సాగే ఈ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం ఖాయం అయ్యాకే తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతి నిరాకరించింది.

మొదటేమో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సదస్సు అని ప్రకటించారు. ఆ తర్వాత ఈ సదస్సులో జగన్ పాల్గొంటాడని.. ప్రత్యేక హోదా తో వచ్చే లాభాల ఆవశ్యకతను వివరిస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి నిలపింది. జగన్ కు ఎర్ర జెండాను చూపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సదస్సుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. యూనివర్సిటీల్లో రాజకీయ కార్యాకలాపాలు వద్దని మంత్రిగంటా హితబోధ చేశాడు. అయితే ఇటీవల కాలంలో కూడావర్సిటీల్లో రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వర్సిటీల మైదానాల్లో పార్టీల సమావేశాలు జరిగాయి.

అయితే అప్పుడు అభ్యంతరం చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశ నేపథ్యంలో మాత్రం ఈ ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకుంది. మొదట ఈ సమావేశానికి అనుమతిని ఇచ్చినట్టుగానే ఇచ్చి… జగన్ ఈ సమావేశలో పాల్గొంటాడనే ప్రకటన వచ్చాకా మాత్రం ప్రభుత్వం టోన్ మార్చింది. వర్సిటీలో సదస్సులు, సమావేశాలు వద్దు అంటోంది. జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటాడని ఖాయం అయ్యేకే ఇలా టోన్ మార్చడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -