వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర దుర్గమ్మ సాక్షిగా విజయవాడలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కనకదుర్గ వారధి వద్ద వైసీపీ శ్రేణులు పోటెత్తారు. జగన్ కు బ్రహ్మరథం పట్టారు. అశేష జనసందోహం మధ్య ఆయన నగరంలోకి అడుగుపెట్టారు.
ప్రస్తుతం ఆయన యాత్ర బందరు రోడ్డుకు చేరుకుంది. ఈరోజు ఆయన కనకదుర్గవారధి గుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి, వెటర్నరీ ఆసుపత్రి సెంటర్, శిఖామణి సెంటర్, పుష్పా హోటల్ సెంటర్, సీతారాంపురం సెంటర్, కొత్త వంతెన, బీఆర్టీఎస్ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట, చిట్టినగర్ వరకు పాదయాత్ర చేస్తారు. చిట్టినగర్ సెంటర్ లో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఈరోజు యాత్ర ముగుస్తుంది.
వైఎస్ జగన్‌ను కలిసేందుకు కృష్ణా జిల్లా లాయర్లు కనకదుర్గ వారధికి చేరుకున్నారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు.
అశేష జనసందోహం నడుమ ఘనంగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర#PrajaSankalpaYatra pic.twitter.com/kVYq360TBn
— YSR Congress Party (@YSRCParty) April 14, 2018