- Advertisement -
శ్రీరాఘవేంద్ర స్వామి కొలువుదీరిన మంత్రాలయంలో.. గురుభక్తి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురురాఘవేంద్రుడి 395వ పట్టాభిషేకోత్సవం సందర్భంగా.. తెల్లవారుజామునే స్వామివారి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి బంగారు పాదుకలను బంగారు సింహాసనంపై ఉంచి నవరత్నాలతోటి.. వివిధ రకాల పూలతోటి..
బంగారు నాణేలతోను అభిషేకించారు. అనంతరం స్వామి వారి బంగారు పాదుకలను స్వర్ణ రథంపై ఉంచి శ్రీమఠం ప్రాకారం చుట్టూ ఊరేగించారు. పండితుల మంత్రోచ్చాటనల నడుమ సాగిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గురువారం నుంచి ఆరు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.
