ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమా షూటింగ్ నగర శివార్లలో జరుగుతుంది.సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం బిగ్‌బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్ అయిన ఆదర్శ్‌ను తీసుకున్నారు.ఈ సందర్భంగా సెట్స్‌లో త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటోను ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
‘అతిధి పాత్రలో నటిస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ లతో కలిసి పనిచేయాలన్న తన కల నిజమైందని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, ఈశా రెబ్బా నటిస్తున్నారు.ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయలని సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.