Sunday, May 19, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డితో పెట్టుకున్నవాడు మమూలోడు కాదు..!

- Advertisement -

తీగలాగితే డొంక కదిలింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద ఐటీ శాఖకు ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావు ఎవరు ? ఏ పార్టీతో సబందాలున్నాయి ? ఎవరి ప్రోద్భలంతో అతడు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశాడు ? అని ఆరా తీసిన మీడియాకు కళ్లుతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. దొంగే దొంగ అనటం అంటే ఇదేనని తేలింది. తనని తాను అడ్వకేట్ గా చెప్పుకుంటున్న రామారావుపై హైదరబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో 32 కేసులు నమోదయ్యాయి. అతడు భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, తమ ఆస్తులను ఆక్రమించుకున్నాడని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో చిలకలగూడ పోలీసులు ఇప్పటికే అతడిని పలుమార్లు అరెస్ట్ చేశారు. వార్నింగ్ ఇచ్చారు. రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. ఒడిషా రాష్ట్రంలోని బరంపురం ప్రాంతానికి చెందిన ఇమ్మినేని రామారావు చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి ఎల్లారెడ్డిగూడలో స్థిరపడ్డాడు. అక్కడే పడాల రామిరెడ్డి కాలేజ్ లో లా చదివాడు. చదువు పూర్తయ్యాక సొంతూరు బరంపురం వెళ్లిపోయాడు. మళ్లీ 2014లో హైదరాబాద్ వచ్చాడు. ఈ సారి పద్మారావునగర్‌లో మకాం వేశాడు. అడ్వకేట్ అని చెప్పుకోవడంతో పలువురు భూమి కేసులు, ఫ్లాట్లు, సైట్లుకు సంబంధించిన వివాదాల పరిష్కారం కేసుల కోసం ఇతడిని ఆశ్రయించేవారు. వాళ్లు ఇచ్చే దస్తావేజులకు డూప్లికేట్ దస్తావేజులు తయారు చేయించి, అవి తనవేనంటూ భూ కబ్జాలకు పాల్పడటం ఇతడి అలవాటు.

అలా రామారావు ఇంతవరకూ పలువురి ఇళ్ల స్థలాలు, భూములు, ఇళ్లను కబ్జా చేశాడని ఫిర్యాదులు అందాయి. 2013 అక్టోబరు 24న పద్మారావునగర్‌కు చెందిన జి.సాయిపవన్‌ అనే బాధితుడు తన ఇంటిని రామారావు ఆక్రమించుకున్నాడని చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2016 జనవరి 11న ఒక్కరోజే ఇతడిపై భూ కబ్జా ఆరోపణలు చేస్తూ ఐదు కేసులు నమోదయ్యాయి. వరుస ఫిర్యాదులు వస్తుండటంతో పోలీులు రామారావుపై దృష్టి పెట్టారు. 2016 మార్చి 14న చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. అదే ఏడాది అదే నెలలో19వ తేదీన రామారావు రౌడీషీట్‌ ఓపెన్ చేశారు. ప్రస్తుతం అతడిపై చిలకలగూడ, చందానగర్‌, బోయినపల్లి సహా హైదరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో 32 కేసులున్నాయి. వీటిలో 14 చిలకలగూడ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖకు ఇతగాడు చేసిన ఫిర్యాదుల ఎపిసోడ్ తో మొత్తం తీగలాగితే ఈ రామారావు డొంక కదిలింది. ఇతడే పెద్ద భూ కబ్జాకోరు, నేరచరిత్ర,, రౌడీషీట్ కలిగి ఉండి ఇంకొకరిపై దొంగ దొంగ అనడం చూస్తే విడ్డూరంగా ఉంది. మొత్తానికి తాను తీసిన గోతిలో తానే పడ్డారు రామారావు. నిన్నటి వరకూ ఇతనిపై ఇన్ని కేసులున్నా, ఎవరికీ తెలియకుండా గడిపేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తో అతడిపై ఉన్న కేసులు, నేరచరిత్ర అంతా ఒక పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసి, ఇతడి లెక్కేంటో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -