- Advertisement -

జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూత…సంతాపం తెలిపిన ప‌లువురు ప్ర‌ముఖులు

- Advertisement -

హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి, 2012లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పని చేసిన జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి క‌న్ను మూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం మరణించారు. గత నెలరోజులుగా జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి ఏఐజీలో చికిత్స పొందుతున్నారు.ఇవాళ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు న్యాయమూర్తులు, న్యాయకోవిదులు సంతాపం తెలిపారు. సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సుభాషణ్‌ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో జరగనున్నాయి.

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశానికి ఆయన అందించిన సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అవంతినగర్‌లోని ఆయన నివాసానికి వెల్లి ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -