- Advertisement -

టీజర్ తో అదరగొట్టిన ఎన్టీఆర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా జనతా గ్యారేజ్. మొదటి నుంచే ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రంజాన్ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక టీజర్ అభిమానులు ఏవిధంగా ఊహించుకున్నారో ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా అదరగొట్టేశాడు యంగ్ టైగర్.

ఈ టీజర్ చూసిన అభిమానులు ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతోంది అని అంటున్నారు.  కొరటాల శివ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. బలహీనుడైన వాడికి బలంగా జనతా గ్యారేజ్ ఉంటుందని తారక్ చెప్పే డైలాగ్ కేక పెట్టిస్తుంది. అందుకే ఈ  ఈ టీజర్ యూట్యూబ్ లో 6 గంటల్లోనే 1 మిలియన్ వ్యూయర్స్ తో సంచలనంగా మారింది.

ఇక టీజర్ తోనే రికార్డులు షురూ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరియర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలవనుందట. ఇక తుది దశకు చేరుకున్న షూటింగ్ త్వరలో ముగించుకుని ఆడియోను జూలై 22న, సినిమాను ఆగష్టు 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి జూనియర్ టీజర్ తో చేస్తున్న ఈ సంచలనం ఎక్కడికెళ్ళి ఆగుతుందో చూడాలి. 

{youtube}v=q6voJ13asIo{/youtube}

Related

  1. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో ఎప్పుడంటే ..
  2. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?
  3. ఎన్టీఆర్ డెడికేషన్ చూసి కొరటాల షాక్!
  4. ఎన్టీఆర్ గొప్పతనం ఇటీవలే బయట పడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -