పవన్ సారీ చెప్పేశాడు! ఎందుకో తెలుసా?

స్టార్‌డమ్ వస్తే చాలు ఏదైన్ చేయోచ్చు అనుకుంటారు కొందరు. ఆ గర్వంతోనే తప్పులు చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు అని తెలిసినా.. తమని తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారే తప్ప.. అందుకు క్షమాపణలు చెప్పేందుకు మాత్రం నిరాకరిస్తారు. కానీ కొందరు మాత్రం తాము చేసిన తప్పు చిన్నది అయిన బహిరంగంగానే సారీ తమకు ఉన్న మంచి మనసుని చాటుకుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలాంటివారిలో ఒకరని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే నిజానికి పవర్ స్టార్ చేసింది తప్పు కాదు అయినప్పటికి తన వల్ల జరిగిన చిన్న ఆటంకానికి సారీ చెప్పి.. అందరి మన్ననలు పొందాడు. ఇటివళే యూకే తెలుగు అసోసియేషన్‌వారు లండన్‌లో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ తో ఫోటోలు దిగిందుకు పవన్ ఫ్యాన్స్ ఆతృత చెందారు.

మరీ వైపు కార్యక్రమం జరుగుతోంది. దీంతో.. పెర్ఫార్మ్ చేస్తున్నవారికి ఆటంకం కలిగింది. ఫ్యాన్స్ అంటే ఎంతో గౌరవించే పవన్ చాలా ఓపికగా ఫోటోలు దిగారు. అయితే తనవల్ల అక్కడి వాతావరణం గందరగోళంగా మారడంతో పవన్ సారీ చెప్పారు. ‘‘పెర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు నేను ఫోటోలు దిగుతూ డిస్ట్రర్బ్ చేశాను.. అందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను’’ అని పవన్ అన్నారు. దీంతో.. పవన్ ఫ్యాన్స్ అందరూ కేకలతో హోరెత్తించారు. 

{youtube}v=0nAF47xcVSs{/youtube}

Related

  1. పవన్ కళ్యాణ్ vs జగన్ .. ఎవరికి మీ ఓటు ?
  2. ఎక్స్ క్లూజివ్ : కృష్ణుడు గా మారిన పవన్ కళ్యాణ్
  3. మహేష్ ని అవమానిస్తున్న పవన్ ఫ్యాన్స్
  4. బన్నీ నిలబడాలంటే పవన్ ను తొక్కాల్సిందేనా?