పవన్ కళ్యాణ్ ని చూడడానికి ఫాన్స్ ఎగబడుతూ ఉంటారు. ఆయన కొత్త సినిమా ఇదిగో అదిగో అంటూ డైరెక్టర్ ల పేర్లూ , హీరోయిన్ ల పేర్లూ మారుతూ ఇంకా ఎవరితో ఓకే అవుతుందో కూడా తెలీకుండా సాగుతోంది. కొత్త సినిమాని హడావిడిగా మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ తారవాత షూటింగ్ ఆపేసాడు. డైరెక్టర్ ని కూడా మార్చేసి డాలీ ని తీసుకున్న కళ్యాణ్ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది గ్యారెంటీ కూడా లేదు.
అయితే వీరు అందరికీ పవన్ కళ్యాణ్ సినిమా ప్రొడ్యూసర్ శరత్ మరార్ ఒక సుభవార్త అందించారు. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ , ఆయన్ని కలవడం కోసం ఫార్మ్ హౌస్ కి వెళ్లాను అనీ గోవుల పక్కన కృష్ణుడు లాగా ఉన్నాడు అనీ ఆయనతో సినిమా గురించి మాట్లాడాను అని రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఫోటో ని కూడా ఆయన అందులో జత చేర్చి వెయ్యడం తో ఫాన్స్ పరిస్థితి పండగలా ఉంది.
చాన్నాళ్ళ తరవాత కళ్యాణ్ ని ఇలా అనుకోకుండా చూడడం వారికి పండగే అని చెప్పాలి. దూరంగా నిలబడిన పవన్ కళ్యాణ్ ఆవుల మధ్యలో గొడుగు పట్టుకుని నిలబడ్డాడు. పక్కనే ఆవులు, దూడ గడ్డి మేస్తూ ఉన్నాయి. వారి అందరి మధ్యలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిలా కనిపిస్తూ తన సినిమా గోపాల గోపాలా లోని ” అరెరే అలా ఆయ నందలాలా ” పాట ని గుర్తు చేస్తున్నాడు.
Related
