Monday, May 20, 2024
- Advertisement -

మహేష్ ని అవమానిస్తున్న పవన్ ఫ్యాన్స్

- Advertisement -

తెలుగులో తమ అభిమాన హీరో కోసం ఏదైన చేయడానికి రెడీ గా ఉంటారు వీరాభిమానులు. అయితే వీరి వీరాభిమానం కొన్ని సార్లు హద్దులు దాటేస్తోంది. తమ హీరో గొప్ప అని చెప్పుకోవడంతో పాటు ఇతర హీరోల మీద కామెంట్స్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే తాజా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ పై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. 

అయితే ఇలా పవన్ ఫ్యాన్స్ మహేష్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఇంతగా గొడవ జరగడానికి కారణం ఏంటో తెలుసా?? ఇటివలే గ్రాండ్ గా జరిగిన సైమా అవార్డుల వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా అవర్డు వచ్చింది. దాంతో మహేష్ బాబు ”బెస్ట్ యాక్టర్ ట్రోఫీ ఇచ్చినందుకు థాంక్స్ సైమా ” అని ట్వీట్ చేసాడు.

ఆ ట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు ఇంత రాద్దంతానికి కారణం అయ్యింది. ట్రోఫీ అనే పదాన్ని క్రీడల్లో మాత్రమే వాడతారని కానీ మహేష్ అవార్డ్ విషయంలో వాడుతున్నాడని ఈమాత్రం కూడా మహేష్ కు తెలియదా అంటూ పవన్ ఫ్యాన్స్ మహేష్ ని అవమానిస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ అందరు కాదు కొందరు మాత్రమే ఇలా చేస్తున్నారు అని మరి కొందరు అంటున్నారు. మరి ఈ గొడవ ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. 

Related

  1. సంపూకి ఘోర అవమానం..!
  2. మహేష్ సినిమాని అవమానించాడు!
  3. పవన్ ని అవమానిన్చారట!
  4. బన్నీ నిలబడాలంటే పవన్ ను తొక్కాల్సిందేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -