టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో పాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే ఎన్టీఆర్ మంచి నటుడే కాకుండా మంచి సింగర్ అన్న విషయం కూడా తెలిసిందే. ఇపట్టికే పలు చిత్రాల్లో ఎన్టీఆర్ పాటలు పాడిగా ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కోసం పాడనున్నాడని తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రచారం జరగుతోంది.
కాకపోతే ఈ విషయంపై రాజమౌళి కన్ఫర్మ్ చేయలేదు. జక్కన్న – ఎన్టీఆర్ లు మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి పైగా ఎన్టీఆర్ అంటే జక్కన్న కు ప్రాణం అయితే ప్రస్తుతం జక్కన్న కున్న కమిట్ మెంట్ వల్ల ఎన్టీఆర్ తో సినిమా చేయలేకపోతున్నాడు.
దీంతో ఎన్టీఆర్ అబిమానులు తీవ్ర అసహనం తో ఉన్నారు. అందుకే అభిమానులను సంతోష పెట్టడానికి ఎన్టీఆర్ చేత బాహుబలి ది కంక్లూజన్ లో ఒక పాట పాడిస్తే ఫ్యాన్స్ సంతోషిస్తారని అనుకుంటున్నారట. ఒకవేళ ఎన్టీఆర్ చేత పాట పాడిస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగే. ఆమధ్య కన్నడం లో కూడా ఎన్టీఆర్ పాట పాడాడు. సో జక్కన్న అడిగితే ఎన్టీఆర్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు.
Related
