Saturday, June 1, 2024
- Advertisement -

కొరటాల డైరెక్షన్లో ముఖ్యమంత్రిగా పవన్ సినిమా!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంది. అందుకే 2019 లోపే పవన్ వీలైన సినిమాలు చేయాలి అని భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్ సినిమా తర్వాత దాసరి నారాయణరావు బ్యానర్లో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇప్పుడు పవర్ స్టార్ కోసం మరో కథ సిద్ధం అవుతోంది.

మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కొరటాల శివ జనసేన అధినేత కోసం రాజకీయ నేపథ్యంలో సాగే ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు సమచారం. కష్టాల్లో ఉన్నారు అంటే పవన్ ఎక్కడ ఉన్న సహాయం చేస్తాడు. అలాంటి కథతోనే ఇప్పుడు కొరటాల ఈ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ మిర్చి, శ్రీమంతుడు, జనత గ్యారేజ్ వంటి మూడు సినిమాలు తీసి మంచి చెపుతునే కమర్షియల్ గా సూపర్ హిట్స్ కొట్టాడు.

ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. మహేష్ తో సినిమా కంప్లీట్ అవ్వగానే పవన్ తో సినిమా మొదలు పెట్టనున్నాడు. పవన్ కూడా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాలు కంప్లీట్ అవ్వగానే కొరటాల శివ దర్శకత్వంలో పవన్ నటించనున్నారు. మరి కొరటాల శివ పవన్ ను ముఖ్యమంత్రిగా చూపిస్తే.. ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్ని బద్దలు అవ్వడం ఖాయం.

Related

  1. పవన్ కళ్యాణ్ తమ్ముళ్ళు వీళ్ళే
  2. పవన్ తో యామిని భాస్కర్ రొమాన్స్!
  3. ఆ హీరోయిన్ ని బాధపెడుతున్న పవన్!
  4. సూపర్ .. మళ్ళీ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చిత్రం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -