ఐపిఎల్ ఫిక్సింగ్ పై సుప్రీంకు నివేదిక
ఐపిఎల్ క్రికెట్ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు తుది నివేదిక అందజేసింది.
కిరణ్ కుమార్ రెడ్డి కి బిజెపిలో పదవి?
కిరణ్ కుమార్ రెడ్డి భాజపాలో చేరుతున్నారంటూ ఈ మద్య ప్రచారం బాగానే జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించనూ లేదు. జై సమైక్యాంధ్ర అంటూ పార్టీ పెట్టి కనుమరుగైన కిరణ్‌కుమార్ రెడ్డి గురించి తాజాగా మరో వార్త ప్రచారం జరుగుతోంది.
శ్రద్ధదాస్ రెచ్చిపోయింది.
సరిగా హిట్ లేక టాలీవుడ్‌లో సద్దుకుపోతున్న శ్రద్ధాదాస్‌కి అవకాశాలు అంతంత మాత్రమే! అయినప్పటికీ అందాల ఆరబోత కు ఏమాత్రం వెనుకాడక చాలా చిత్రాల్లో అందాలతో రెచ్చిపోయింది అయినా ఈ భామ ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోనేలేదు దాంతో ఇక లాభం లేదనుకొని బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ”జిద్ ” అనే సినిమాలో రెచ్చిపోయి తన సత్తా ఏంటో చూపించింది.
పైరసీ వీడియో సెంటర్లపై హీరో విశాల్ దాడి
పైరడులు కూడా చేసి పోలీసులకు అప్పగించాడు. సినిమా షూటింగ్ నిమిత్తం పొలాచి వెళ్ళిన విశాల్ అక్కడ వీడియో సెంటర్లలో తమిళ సినిమాలు ఏమేమి ఉన్నాయో కనుక్కోమని తన మనుషులను పురమాయించాడు
ఆధార్ లేని 18 లక్షల రైతులకు రుణమాఫీ లేదు.
రుణమాఫీ లబ్దిదారుల జాబితాను ఏపీ సర్కార్ నవంబర్ 5నప్రకటించనుంది. రుణమాఫీ లబ్దిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. పదో తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించనుంది.ఆధార్ కార్డు లేదని సుమారు 18 లక్షలమంది అకౌంట్లను ఏపీ సర్కార్ తిరస్కరించింది. ఆధార్ కార్డుల సమర్పణకు ఈరోజుతో గడువు ముగిసింది.నవంబర్ 15 నుంచి తొలివిడత చెల్లింపులు ప్రారంభం కానున్నాయి.
ఫోటో తీసుకుంటే దెయ్యం వచ్చింది
దెయ్యం అంటే మనం అమ్మో అంటాం.. మన దేశంలో దెయ్యాలు ఉన్నాయని వాదించేవాళ్లు కొందరైతే, మరికొందరు లేవని వాదిస్తారు.
చంద్రబాబు నాయుడును కలిసిన పవన్ కళ్యాణ్
ప్రముఖ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తుపాను సమయంలో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడిందని పవన్ కళ్యాణ్ అన్నారు.
‘జ్యోతిలక్ష్మి’ అనే టైటిల్ తో సినిమా….
తనదైన గ్లామర్ తో టాలీవుడ్ లో ఆకట్టుకున్న అందాలా భామ చార్మి . పెద్ద హీరోల సరసన నటించిన ఈ భామకు గత కొంత కాలంగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తోంది. గతంలో తాను నటించిన 'మంత్ర' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 'మంత్ర 2'లో ప్రస్తుతం ఆమె నటిస్తోంది.
రామ్ చరణ్ టార్గెట్ వందకోట్లా..??
మెగా హీరో రామ్ చరణ్ టార్గెట్ వందకోట్ల పై పడింది ? అవును ఇప్పటికే చరణ్ నటించిన గోవిందుడు అందరి వాడెలే సినిమా మంచి బిజినెస్ వర్గాల్లో క్రేజ్ ని క్రియేట్ చేసింది . ఇప్పటికే ఈ సినిమాకు భారి రెస్పాన్స్ వస్తుందని సమాచారం .
ఆర్టీసీ కార్మికుల సమ్మె:
తమను మానసికంగా వేధిస్తున్న రాయలసీమ రీజియన్ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ఎన్ఎంయూ కార్మికులు శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడీ వైఖరికి నిరసనగా రాయలసీమలోని వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలోనిని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.
అంగారకయాత్రలో తుది ఘట్టం, మార్స్ చెంతకు మామ్!
భారత అంగారక యాత్రలో తుది ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లోపే అంతరిక్ష రంగంలో భారత్‌కు చరిత్రాత్మక విజయం సొంతం కానుంది. సరిగ్గా రేపు(బుధవారం) ఉదయం 7:17:32 గంటలకు
ఉప ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి భంగపాటు జరిగింది. 18 స్థానాలకు గాను బీజేపీ 7 మాత్రమే గెలుచుకుంది. బీహార్ లో 10 స్థానాలకు ఎన్నికలు జరగగా, లాలు - నితీష్ కూటమి 6 స్థానాల్లో విజయం సాధించింది.
అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసిన పవన్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భేటీలో రెండు, మూడు అంశాలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.
అమిత్ షాకు అభినందన సభ
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నగరంలో అభినందన సభ జరుగనుంది. గురువారం సాయంత్రం సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్‌లో ఈ సభను నిర్వహించనున్నారు.
ఏపీ బడ్జెట్ రూ.1,11,824 కోట్లు
ఏపీ అసెంబ్లీ లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2013-14 బడ్జెట్ ను మొదటి సారిగా ప్రవేశ పెట్టారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం బడ్జెట్ రూ.1,11,824 కోట్లతో ప్రవేశ పెడుతున్నామన్నారు.
అజెండా పూర్తి చేయలేకపోయాం : కోడెల
సభలో నిన్న, ఇవాళ అజెండా పూర్తి చేయలేకపోయామని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. సభలో అన్ని పక్షాలు సహకరిస్తే సభ సజావుగా నడపడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదు, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వవచ్చునన్నారు. ఈరోజు సభ వాయిదాపడిన తర్వాత సభ్యుల మధ్య అవాంఛనీయ ఘటన జరిగినట్టు తెలిసిందన్నారు. సభా మర్యాదలకు భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్నారు.