Tuesday, May 14, 2024
- Advertisement -

టాలీవుడ్ రివ్యూ @ 2016

- Advertisement -
2016 heroes hits flaps

సంక్రాంతి బరిలో డిక్టేటర్‌గా వచ్చిన బాలకృష్ణ సంతృప్తికరమైన విజయాన్ని అందుకోగా సోగ్గాడే చిన్నినాయనతో  సంక్రాంతి హీరోగా నిలిచాడు కింగ్ నాగార్జున. ఈ సినిమా యాభై కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఊపిరి సినిమాలో ఛాలెంజింగ్‌ పాత్రచేసి మెప్పించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన నాన్నకు ప్రేమతో నటుడిగా ఓ మెట్టు ఎక్కిన ఎన్టీఆర్‌… జనతా గ్యారేజ్‌ తో  భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇది వంద కోట్లు వసూలు చేసింది. పెద్ద హీరోల సినిమాలు వచ్చినా ఎక్స్‌ప్రెస్‌ రాజాగా వచ్చిన శర్వానంద్  సంక్రాంతి బరిలో నిలబడి విజయం సాధించాడు.

ఈ  ఏడాది మాస్ హిట్ అందుకున్న మరో హీరో అల్లు అర్జున్. సరైనోడుగా వచ్చి కమర్షియల్ మార్కెట్ లో తన సత్తా చాటాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి 2016 కొంత నిరుత్సాహాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన బ్రహ్మోత్సవం మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. ఇలాంటి కథని మహేష్  ఎలా అంగీకరించాడని అభిమానులు సైతం షాక్ అయ్యారు. చేదు అనుభవం ఎదురైన మరో టాప్ హీరో..  మన పవన్ కళ్యాణ్. పోలీస్ ఆఫీసర్ గా పవనిజం చూపించినా సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. బాబు బంగారంగా వచ్చిన వెంకటేష్ కి ఈ ఏడాది ఇత్తడైపోయింది.  నిర్మాతగా మారిన చెర్రీ ఈ సంవత్సరం కేవలం ధృవతో సరిపెట్టుకున్నాడు.

యంగ్ హీరోల్లో ఫుల్ జోష్ లో ఉన్న నటుడు నాని. ఈ ఏడాది కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్‌మెన్‌, మజ్ను సినిమాలతో వరుస హిట్ లు అందుకుని మరో యువహీరోకు దక్కని క్రెడిట్ దక్కించుకున్నాడు. నాగచైతన్య….  ప్రేమమ్ తో  ఓకే అనిపించినా సాహసం శ్వాసగా సాగిపోతో  మాత్రం నిరాశపరచాడు. నితిన్‌ నటించిన అ ఆ సినిమా త్రివిక్రమ్ మార్క్ కావడంతో అభిమానుల  ఆదరణ పొందింది.  ఇక రామ్.. నేను శైలజతో, నిఖిల్…  ఎక్కడికి పోతావు చిన్నవాడాతో,  నారారోహిత్,  నాగశౌర్య.. జ్యో అచ్యుతానందతో  హిట్ ను అందుకోగా సందీప్‌ కిషన్‌.. రన్ సినిమాతో, అల్లరి నరేష్‌… సెల్ఫీ రాజతో, ఆది… చుట్టాలబ్బాయితో , సునీల్.. జక్కన్నతో, మంచు విష్ణు, రాజ్ తరుణ్… ఇడో  రకం ఆడో రకంతో  ఫ్లాప్ లను అందుకున్నారు. డబ్బింగ్‌ చిత్రాలుగా విడుదలైన ‘బిచ్చగాడు, 24’ సినిమాలు మాత్రం కలెక్షన్ల పరంగా టాలీవుడ్ ను షేక్ చేశాయి. అయితే ఏమాత్రం ఎక్స్ పెక్టేషన్ప్ లేకుండా విడుదలైన పెళ్లి చూపులు మాత్రం కనకవర్షం కురిపించింది. మొత్తానికి ఈ ఏడాది వైవిధ్యచిత్రాలను బాగా ఎంకరేజ్ చేసిందని చెప్పాలి.

Related

  1. పవన్ కి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్!
  2. అల్లు వారు వస్తే.. నేను రాను.. తేల్చుకోండి!
  3. ఎన్టీఆర్‌కు మీద భారీ కుట్ర‌!
  4. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మోహన్‌లాల్‌ సారీ చెప్పాడు! ఎందుకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -