Wednesday, May 1, 2024
- Advertisement -

ఆ బాధ భరించలేక.. ఆత్మహత్య ట్రై చేసిన చలపతిరావు

- Advertisement -
Actor Chalapathi Rao respond on his real life story

అమ్మాయిలు హానికరం కాదుకానీ… పక్కలోకి పనికివస్తారంటూ” వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చలపతిరావు రీసెంట్ గా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఆ టైంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని.. కానీ చేసుకోలేకపోయానని తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 1}

తాజా ఓ చానెల్ తో మాట్లాడుతూ.. సినిమాలోకి రాకముందు పెళ్లి చేసుకున్నాను. అయితే నాకు 27 ఏళ్ల వయసు వచ్చేసరికే నా భార్య కన్నుమూసింది. అప్పటికి నేను చాలా పేదరికంలో ఉన్నాను. అప్పటికే నాకు ముగ్గురు పిల్లలు. ఆ టైంలో ఏమి చేయాలో అర్ధం కాలేదు. ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు.. అప్పుడు ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచన వచ్చింది. కానీ పిల్లల్ఉ దిక్కులేని వారు కాకుండదని ఆ ఆలోచన మానుకున్నను. ఆ టైంలో సీనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య తారకమ్మ ఎంతో ధైర్యం చెప్పారు. ఓదార్చారు.

{loadmodule mod_custom,Side Ad 2}

మళ్లీ పెళ్లి చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ అందుకు నా మనసు ఒప్పుకోలేదు. నా పిల్లలను పెంచి పోషించడమే నా ధ్యేయం అనుకున్నాను. సినిమాల్లో ఎంతో కష్టపడ్డాను. ముగ్గురు పిల్లలను అమెరికాలో చదివించాను. ముగ్గురూ పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు అయ్యారు. జీవితంలో స్థిరపడ్డారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంద’ని చెప్పారు చలపతిరావు. ఇక ఇప్పటికి 1500పైగా సినిమాలో నటించనని 70 యేళ్ళ చలపతిరావు.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో దాదాపు 50 ఏళ్ల సినిమా కెరీర్‌ను సునాయాసంగా పూర్తి చేసుకున్నారు. కానీ సినీ లైఫ్ లో రెండు మూడు సార్లు వివాదాల్లో చిక్కుకుని సారీ చెప్పిన సంఘటనలు ఉన్నాయి. రీసెంట్ గా రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో కూడా ఆయన ఆడవారిపై వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెల్సిందే. 

{youtube}jC0t3_nNwHI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల
  2. చలపతి విషయంలో.. రవికి షాక్ ఇచ్చిన శ్రీముఖి..
  3. షూటింగ్స్‌ లో చలపతి దారుణంగా చేస్తాడు.. నిజాలు చెప్పిన ప్రగతి ఆంటీ
  4. తప్పేం ఉంది..? ఎందుకు ఈ లోల్లి.. చలపతి క్లారిటీ…..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -