Friday, May 17, 2024
- Advertisement -

ప్ర‌త్యేక‌హోదాను తాక‌ట్టుపెట్టావ‌నే దానికి…. మౌనం అంగీకారం దేనికి సంకేతం..?

- Advertisement -
Why YSRCP silent on AP Special Status in BJP Chief Amit Shah Tour in AP..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీనీ బ‌లోపేతం చేయ‌డంపై భాజాపా ఛీప్ అమీత్ షా దృష్టిసారించారు.ముందుగా తెలంగాణాలో మూడు రోజుల‌పాటు ప‌ర్య‌టించి కార్య‌క‌ర్త‌ల‌కు దిశిన‌ర్దేశం చేయ‌డంతోపాటు …కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు.ఆయ‌న చేసిని విమ‌ర్శ‌ల‌కు సాక్షాత్తు సీఎం కేసీఆర్‌దుమ్ము దులిపారు.

అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా ఏపీలో మాత్రం చంద్ర‌బాబుపై ఒక్క విమ‌ర్శ చేయ‌రు పైగా విందుభోజ‌నం ఏర్పాటు చేసుకున్నారు.ఎందుకంటె ఇక్క‌డ మిత్ర‌ప‌క్షం కాబ‌ట్టి.ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్‌కు చిత్త‌శుద్ధి ఉంటె ఎందుకు అమీత్‌షాను ప్ర‌శ్నించ‌లేదు.ప్ర‌త్యేక‌హోదా లేదు….ప్ర‌త్యేక ప్యాకేజికి దిక్కూ మొక్కూలేదు…ఇక రైల్వేజోన్ ఊసెలేదు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై చాలా అనుమానాలున్నాయి. మ‌రి, అమిత్‌షా రాక‌ను వ్త‌రేకించ‌కుండా జ‌గ‌న్ మౌనంగా ఉండ‌డ‌మేంట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

అమీత్‌షా టూర్‌పై వైసీపీ ఒక్క‌టంటె ఒక్క విమ‌ర్శ‌లేకుండా మౌనంగా ఉండిపోయింది.కొద్దో గొప్పో ప్ర‌త్యేక హాదా కావాల‌ని కాంగ్రెస్ కొంతైనా హ‌డావుడి చేసింది..మ‌రి జ‌గ‌న్ క‌నీసం ప్ర‌త్యేక హోదా కావాల‌ని ఎందుకు ప్ర‌శ్నించ‌డంలేదు. సందిట్లో స‌డేమియాగా జ‌న‌సేన పార్టీ కూడా హ‌డావుడి చేసింది. ఏపీ త‌రుపున ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా శ‌గ అమీత్‌షాకు త‌గిలించాలిక‌దా…అది పూర్తిగా ప్ర‌తిప‌క్షంమీద‌నే ఉంది.మ‌రి ఎందుకు మౌనంగా ఉన్న‌ర‌నేది ప్ర‌శ్న‌గా మారింది.
అవ‌కాశం వ‌చ్చిన‌పుడు మ‌న ప్రతాపం చూపించ‌కుండా వైఎస్సార్సీపీ సైలెంట్‌ అయిపోయింది ….? పైగా సొంత ఛాన‌ల్‌,ప‌త్రిక‌లో క‌నీసం అమిత్‌ షా టూర్‌కి వ్యతిరేకంగా కథనాలేమీ లేవు. వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి హత్య ఘటనపైనే కథనాలు పుంఖాను పుంఖాలుగా దర్శనమిచ్చాయి. రాష్ట్రానికి ర‌వాల్సిన వాటిపై పోక‌స్ పెట్ట‌కుండా …ఎంత‌సేపు టీడీపీ -భాజాపా మ‌ధ్య‌నున్న విబేధాల‌పై దృష్టిపెట్టింది.

{loadmodule mod_custom,Side Ad 2}

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి మద్దతు పలికిని వైఎస్‌ జగన్‌, ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ప్రశ్నిస్తూనే వుంటానని మొన్నీమధ్యనే ఢిల్లీ టూర్‌లో సెలవిచ్చారు. ఏదీ, ఎక్కడ.? బీజేపీని ప్రత్యేక హోదాపై నిలదీయడానికి ఇంతకన్నా మంచి సందర్భం వైఎస్‌ జగన్‌కి ఇంకోటి దొరక్కపోవచ్చు.క‌నీసం పార్టీ శ్రేణుల్నైనా ప్ర‌త్యేక హోదాపై సెగ అమీత్‌షాకు త‌గిలేలా చేయాల్సిన జ‌గ‌న్ …మౌనంగా ఉండ‌టం చూస్తె ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టార‌నే సంకేతాలు ప్ర‌జ‌ల‌ల్లోకి వెల్ల‌డం కాయం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -