Saturday, May 18, 2024
- Advertisement -

ద‌క్షిణ చైనా స‌ముద్ర జ‌లాల్లోకి ప్ర‌వేశించిన అమెరికా యుద్ధ‌నౌక‌

- Advertisement -
China protests U.S. Navy warship send to South China Sea

రెండు అగ్ర‌దేశాల మ‌ద్య ఉద్రిక్త వాతార‌వ‌ణం నెల‌కొంది.అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా చైనాకు సవాల్‌ విసిరారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మించిన కృత్రిమ దీవుల సమీపంలోకి అమెరికా యుద్ధనౌక ఒకటి చొచ్చుకెళ్లింది. దీంతో రెండు దేశాల మ‌ద్య మాట‌ల యుద్ధం మొద‌ల‌య్యింది.

పొరుగుదేశాలతో పలు వివాదాలు ఉన్నా లెక్కచేయకుండా చైనా దూకుడుగా దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు, దిబ్బలు, ఇసుక రేవులు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటైన స్ప్రాట్లీ దీవులలోని మిస్‌చీఫ్‌ రీఫ్‌కు అత్యంత సమీపంలో యూఎస్‌ఎస్‌ డీవే యుద్ధనౌక సంచరించినట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ హ‌యాంలో నిర్వ‌హించిన తొలి ఫ్రీడ‌మ్ ఆఫ్ నేవిగేష‌న్ ఆప‌రేష‌న్‌లో భాగంగా అమెరికా యుద్ధ‌నౌక ద‌క్షిణ చైనా స‌ముద్రానికి వ‌చ్చింది. వివాదాస్ప‌ద స్పార్ట్‌లీ దీవుల్లోని మిస్‌చీఫ్ రీఫ్‌లో 20 కిలోమీట‌ర్ల మేర ఈ నౌక ప్ర‌యాణించింది. ఇది గైడెడ్ మిస్సైల్స్‌ను ధ్వంసం చేయ‌గ‌లిగే యూఎస్ఎస్ డేవీ నౌక‌. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు లోబ‌డే ద‌క్షిణ చైనా స‌ముద్రంతోపాటు ఏషియా-ప‌సిఫిక్ ప్రాంతంలోని స‌ముద్ర జ‌లాల్లో ప్ర‌తిరోజు త‌మ యుద్ధ‌నౌక‌ల‌ను తిప్పుతామ‌ని పెంటగాన్ అధికార ప్ర‌తినిధి జెఫ్ డేవిస్ వెల్ల‌డించారు.

{loadmodule mod_custom,Side Ad 1}
ఆయ‌న ఇచ్చిన జ‌వాబు ప‌ట్ల సంతృప్తి చెంద‌ని చైనా త‌మ అనుమ‌తి లేకుండా ఆ యుద్ధ‌నౌక‌ ఎలా ప్ర‌వేశిస్తుంద‌ని అడిగింది. చేసిన త‌ప్పును స‌రిదిద్దుకోవాల‌ని అమెరికాకు సూచించింది. అమెరికా, చైనాల మ‌ధ్య స‌త్సంబంధాలు కొనసాగాలంటే ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించింది. ఇలాంటి రెచ్చ‌గొట్టే చర్య‌ల‌కు దిగ‌కూడ‌ద‌ని చెప్పింది.
చైనా మిత్రపక్షం ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలను కట్టడి చేసేందుకు ఆ దేశం సహకారాన్ని ట్రంప్‌ కోరుతున్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. అయితే, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం చెల్లబోదంటూ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తొలిసారి అమెరికా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్టు ఆ దేశ అధికారులు చెప్తున్నారు

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. ట్రంప్ నిర్ణ‌యంతో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు
  2. భార‌త గ‌గ‌న‌త‌లంలో పాక్ యుద్ధ‌విమానం చ‌క్క‌ర్లు.. ఖండించిన ఐ.ఏ.ఎప్‌. దేనికి సంకేతం….
  3. ఉత్త‌ర‌కొరియ‌వైపు క‌దిలిన అమెరికామ‌రోయుద్ధ నౌక‌
  4. పాకిస్థాన్ అణు క్షిప‌ణుల ర‌హ‌స్య స్థావ‌రం బ‌ట్ట‌బ‌య‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -