Wednesday, April 24, 2024
- Advertisement -

మాఫియా క్వీన్ గా బాలీవుడ్ చిన్న‌ది

- Advertisement -

గంగూబాయ్ ఆర‌హాహై అంటోంది బాలీవుడ్ క‌థానాయిక అలియా భ‌ట్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడీ’. ముంబైని షేక్ చేసిన మాఫియా క్వీన్ గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం ఇది. అలియా భ‌ట్… గంగూబాయ్ గా ఆడియ‌న్స్ ను అల్లాడించ‌బోతోంది. కరోనా పరిస్థితుల రీత్యా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం విడుద‌ల చేసిన ‘గంగూబాయి కతియావాడీ’ ట్రైలర్‌కు మంచి రెన్పాన్స్ వ‌స్తోంది. ‘‘కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా వెలుగు ఉంటుంది ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది’’ అని అజయ్‌దేవ్‌గణ్‌ చెప్పే డైలాగ్‌లతో ట్రైలర్‌లో ప్రారంభ‌మ‌వుతుంది. గంగూబాయిగా అలియా నటన అదరగొట్టేలా సాగింది. ఆమె చెప్పే పంచ్ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా మారునున్నాయి.

‘‘మీకు నా మాటలు అభ్యంతరకరంగా అనిపించొచ్చు. కానీ, జాగ్రత్తగా వినండి. నిజం చెప్పాలంటే మీకంటే ఎక్కువ గౌరవం మాకే ఉంది. ఎందుకు అని అడగాలనుకుంటున్నారా? ఒక్కసారి మీరు మర్యాదను పోగొట్టుకుంటే.. మొత్తంగా పోయినట్టే. కానీ మేము ప్రతి రాత్రి గౌరవాన్ని అమ్ముకుంటాం. కానీ మా గౌరవం ఎప్పటికీ పోదు.’’ అని అలియా చెప్పే డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. క‌తియావాడీకి చెందిన గంగూబాయిగా అలియా భ‌ట్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి మ‌రి.

ఆ ఒక్క సినిమాతో మారిపోయిన త‌ల‌రాత‌

మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కంగ‌న

మాస్టర్ హీరోయిన్‌ పంట పండింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -