అలియా మ‌న‌సులో ఉన్న ఆ హీరో ఎవ‌రు ?

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్…ఇక్క‌డ మ‌రిన్ని అవ‌కాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో రామ్ చ‌ర‌ణ్ కు జ‌త క‌డుతున్న అలియా భ‌ట్.. త్వ‌ర‌లో మ‌రో స్టార్ హీరోతో సినిమాకు ప‌చ్చ‌జెండా ఊపింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఎన్టీఆర్‌30’లో అలియాభట్‌ కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది. నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ.. అలియా భట్‌ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా అలియాభట్‌ని ఎంపిక చేశారు. ‘‘కొరటాల శివ వచ్చి కథ చెప్పారు. నేను మరో మాట లేకుండా అంగీకారం తెలిపాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నా’’ అని చెప్పింది అలియాభట్‌. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ని యువసుధ ఆర్ట్స్‌, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెలలోనే పూజా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

విజయవంతమైన ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ – కొరటాల శివ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. అలియా మనసులో మరో కోరిక కూడా ఉందట. టాలీవుడ్‌లో మరో హీరో సరసన కూడా నటించాలని ఉందనే కోరికను ఈ ముంబై బ్యూటీ బయటపెట్టింది. ఆయనెవరో కాదు… ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. పుష్ప’ సినిమా చూశాక మా ఇంట్లో అంతా బన్నీకి ఫ్యాన్స్‌ అయిపోయారు. నన్ను ఇంట్లో ‘ఆలు’ పిలుస్తారు. అల్లుతో ఆలు ఎప్పుడూ అని ప్రశ్నిస్తున్నారు. బన్నీతో నటించే అవకాశం వస్తే రెండో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంటా. అల్లు అర్జున్‌ నా అభిమాన హీరో’ అని అలియాభట్‌ తన మనసులో మాట బయటపెట్టింది.

మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కంగ‌న

మాస్టర్ హీరోయిన్‌ పంట పండింది

మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -