టీం ఇండియా చరిత్రలో 1000 మైలురాయి

- Advertisement -

ప్రంపంచ క్రికెట్ చరిత్రలో భారత్ అరుదైన ఘనతను నమోదు చేయనుంది. నేడు (ఫిబ్రవరి 6) అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరిగే వన్డే మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలోనే అరుదైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే టీం ఇండియాకు ఇది 1000 వ మ్యాచ్ కావడం విశేషం.

1974 లో జూలై 13న భారత్ తన మొదటి వన్డే మ్యాచ్ ను ఇంగ్లండ్ పై ఆడింది. ఈమ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడింది. వన్డేల్లో భారత్ తొలి విజయాన్ని ఈస్ట్ ఆప్రికాతో ప్రపంచ కప్ లో జరిగిన మ్యాచ్ లో అందుకుంది. కాగా ఇప్పటి వరకు టీం ఇండియా 999 వన్డే మ్యాచ్ లు ఆడగా అందులో 518 మ్యాచ్ ల్లో గెలిచింది. 9 మ్యాచ్ లు టైగా ముగిసాయి. 41 మ్యాచ్ ల్లో ఫలితం రాలేదు. విదేశాల్లో 654 మ్యాచ్లు ఆడింది.

- Advertisement -

ఇటీవల సౌతాఫ్రికాతో ముగిసిన సిరీస్ లో టీం ఇండియా ఘోరంగా విఫలం అయింది. కాగా ఇంగ్లండ్ తో జరిగిన టి 20 సిరీస్ కు క్లీన్ స్వీప్ చేసి విండీస్ జట్టు భారత్ ను సైతం ఓడించాలని కుతూహలంగా ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ కు గాయం కారణంగా దూరంగా ఉన్న రోహిత్ శర్మ ఈ సిరీస్ కు పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే భారత జట్టులో నలుగురు కక్రికెటర్లు కరోనా బారిన పడడంతో టీం ఇండియా బలహీన పడినట్టుగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -