Friday, April 26, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ.. అపర మేధావి “బాబా”గా మారితే..?

- Advertisement -

బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై షకలక శంకర్ టైటిల్ పాత్రలో యువ నిర్మాత బొమ్మకు మురళి నిర్మిస్తున్న సంచలన చిత్రం “ది బాస్”. నెవర్ డైస్ అన్నది ఉపశీర్షిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ వంటి ఓ అపర మేధావి బాబాగా మారితే అనే ఊహాజనిత కథాంశం ఆధారంగా… బహుముఖ ప్రతిభాశాలి ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత వివాదాస్పద చిత్రం ‘ది బాస్-నెవర్ డైస్” టైటిల్ లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు.

ఈశ్వర్ బాబు దర్శకత్వంలో బొమ్మకు మురళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “ది బాస్-నెవర్ డైస్” సమాజంలోని పలు రుగ్మతలను ప్రశ్నిస్తుందని…. రామ్ గోపాల్ వర్మను పోలిన వ్యక్తిగా షకలక శంకర్ అత్యద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తమ చిత్రం “ది బాస్-నెవర్ డైస్” టైటిల్ లోగో ఆల్ రౌండర్ సునీల్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ఈశ్వర్ బాబు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.

డెబోరాఫెల్, సోహైల్, రాజశ్రీ, సన, హర్షవర్ధన్, పోసాని, సూపర్ ఉమన్ లిరిష, పటాస్ ప్రవీణ్, జబర్దస్త్ మురళి, చిట్టిబాబు, పంచ్ ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఛాయాగ్రహణం-కూర్పు: హిమాన్షు, సంభాషణలు: బాద్షా హెచ్.కె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కనకదుర్గ, నిర్మాణం: బొమ్మకు క్రియేషన్స్, సమర్పణ: హిమమాల బొమ్మకు, కథ-నిర్మాత: బొమ్మకు మురళి, దర్శకత్వం: ఈశ్వర్ బాబు ధూళిపూడి!!

చిన్న సినిమాలు బతకాలి.. పెద్ద సినిమాలు ఆడాలి

పది గెటప్స్ లో మాస్ మహారాజ రవితేజ

బాలకష్ణ నెక్ట్స్‌ మూవీలో విలన్ గా స్టార్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -