బాలకష్ణ నెక్ట్స్‌ మూవీలో విలన్ గా స్టార్ హీరో

- Advertisement -

డాన్‌ శీను, బలుపు, క్రాక్‌ లాంటి సినిమాలతో సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడిగా నిరూపించుకున్న దర్శకుడు మలినేని గోపీచంద్‌ బాలకష్ణతో సినిమాను చేయనున్నాడు. ఇది బాలకష్ణకు 107 సినిమా. ఈ సినిమాలో హీరోయిన్‌గా శతిహాసన్‌ నటిస్తుంది. సంగీతాన్ని తమన్‌ అందిస్తాడు.

రాయలసీమకు చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో బాలయ్య మార్క్‌తో యాక్షన్‌ సీన్లను గోపీచంద్‌ ప్లాన్‌ చేశాడు. కాగా ఇప్పటికే బాలయ్యతో సినిమా కథకు సంబంధించిన చర్చలు సైతం పూర్తయ్యాయి.

- Advertisement -

త్వరలోనే పట్టాలకెక్కనున్న ఈ సినిమాలో విలన్‌గా బలమైన వ్యక్తిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లెజెండ్‌ సినిమాలో జగపతి బాబు, అఖండలో శ్రీకాంత్‌ వంటి బలమైన విలన్లు బాలకష్ణ నటించారు. దీంతో కొత్త విలన్‌ కోసం దర్శకుడు వెతుకుతున్నట్టు సమాచారం. కాగా కన్నడ, లె లుగు ప్రజలకు సుపరిచితులైన హీరో అర్జున్‌ను విలన్‌గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు పవర్‌ఫుల్‌ విలన్‌తో గోపీచంద్‌ సినిమా చేయలేదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడనుందా..?

డార్లింగ్ ప్రభాస్ ఇంకా భయపడుతున్నారా..?

చిరంజీవికి ‘అఖండ’సెగ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -