Friday, April 26, 2024
- Advertisement -

ప్రధాని మోదీతో జగన్‌ భేటీ

- Advertisement -

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ చాలా న ష్టపోయిందని, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాని ఏపీ సీఎం వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. సోమవారం జగన్‌ ప్రధానితో, అనంతరం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తోనూ భేటీ అయ్యారు.

సంయుక్త ఆంధ్రప్రదేశ్‌ విభజన వల్ల ఏపీకి రావాల్సినన్ని ని«ధులు రాలేదని చెప్పారు. తెలంగాణ కన్నా జనాభా పరంగా వైశాల్య పరంగా ఏపీ పెద్ద దని తెలిపారు. ఆదాయం తక్కువగా ఉన్నా ప్రజా సంక్షేమం కోసం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అములు చేస్తున్నామని వివరించారు.

అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ఖర్చు బాగా పెరిగిపోయిందని తెలిపారు. పరిహారం చెల్లించేందుకే పెద్ద మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుందని చెప్పారు. ఇది రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని వివరించారు. ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటాను విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.

YSR తెలంగాణ పార్టీలో చేరిన శ్రీ గట్టు రాంచందర్ రావు

చిన్న సినిమాలు బతకాలి.. పెద్ద సినిమాలు ఆడాలి

నేటి నుంచి పాఠశాలలు బంద్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -