Friday, March 29, 2024
- Advertisement -

‘మా’ఎన్నికల బ‌రిలో నటి హేమ..

- Advertisement -

సెప్టెంబర్‌లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు మరింత ర‌స‌వత్తరంగా మారబోతున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవి కోసం విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్, యువ‌హీరో మంచు విష్ణు, సీనియ‌ర్ న‌టీమ‌ణి జీవితా రాజ‌శేఖ‌ర్‌లు పోటీలో ఉండగా .. తాజాగా ఈ ఎన్నికలలో నేనూ బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు సీనియర్‌ నటి హేమ. దీంతో ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో నన్ను సపోర్ట్‌ చేసిన వారందరి కోరిక మేరకు ఈసారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నాన‌ని హేమ తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ.. గ‌త కొన్నేళ్లుగా మా ఉపాధ్య‌క్షురాలిగా సంయుక్త కార్య‌ద‌ర్శిగా ఈసీ స‌భ్యురాలిగా పలు ప‌ద‌వులు చేప‌ట్టాను. ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఆ పదవులకు పూర్తి న్యాయం చేశానని అన్నారు హేమ. ఈ సారి ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్నాను. ఎల‌క్ష‌న్ ముందు ఆలోచ‌న ఇది. కానీ ఆలోచ‌న మారింది. పెద్ద‌లంతా ఎల‌క్ష‌న్ బ‌రిలో దిగుతున్నారని తెలిశాక‌.. పెద్ద‌లు పెద్ద‌ల వివాదాల్లో మ‌న‌మెందుకు చిక్కుకోవాలి అనుకొని అస‌లు పోటీ చేయొద్ద‌నే ఊరుకున్నా.

నిన్నటి ప్ర‌క‌ట‌న అనంత‌రం సినీప్ర‌ముఖుల నుంచి ఒత్తిడి వచ్చింది. నేను ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన‌ప్పుడు నా స్నేహితులు ముఖ్యంగా లేడీ స‌పోర్టర్స్, న‌న్ను మెజారిటీతో గెలిపించిన సినీ ప్రముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయ‌కూడ‌దు.. నువ్వుంటే బాగుంటుంది. నాకు అండ‌గా నిలిచిన వారంద‌రికోసం, నా వారి కోసం మా ఎన్నిక‌ల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాల‌నుకుంటున్నాను” అని హేమ అన్నారు. మా అధ్యక్ష పదవికి పూర్తి న్యాయం చేయగలనని నాకు పూర్తి నమ్మకం ఉందని ఆమె అన్నారు.

పెళ్లి చేసుకున్న రెండు నెలలకు భార్య హిజ్రా అని తెలిసి భర్త షాక్!

మీ అభిమానాకి ధన్యవాదాలు చిరంజీవి గారు : సీఎం జగన్

సుప్రీం ఆదేశాలు పాటిస్తాం.. ఆదిమూలపు సురేశ్​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -