Friday, April 19, 2024
- Advertisement -

సుప్రీం ఆదేశాలు పాటిస్తాం.. ఆదిమూలపు సురేశ్​

- Advertisement -

టెన్త్​, ఇంటర్మీడియట్​ పరీక్షల నిర్వహణకే ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పలు సార్లు స్పష్టం చేసింది కూడా. కరోనా థర్డ్​వేవ్​ భయంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయి. కానీ విద్యార్థుల భవిష్యత్​ దృష్ట్యా .. తగిన జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించి తీరుతామని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం కేరళ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల ఆరోగ్యాల పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏ ఒక్క విద్యార్థి మరణించిన ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించింది.

అయితే ఈ విషయంపై తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ స్పందించారు. ‘ సుప్రీంకోర్టు ఆదేశాలను తాము తూచ తప్పకుండా పాటిస్తాం. పరీక్షలు ఎలా నిర్వహించబోతున్నామో కోర్టుకు స్పష్టంగా తెలియజేశాం. గదిలో 15 మందితో మాత్రమే ఉండేలా చూసుకుంటాం. కచ్చితంగా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటాం.

ఈ విషయాలన్ని కోర్టుకు వివరించాం. ఈ విషయంపై కోర్టు గురువారానికి విచారణ వాయిదా వేసింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కచ్చితంగా పాటిస్తాం’ అంటూ ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. ఏపీలో కేసులు ఇంకా అదుపులోకి రానందున పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. నేడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలి.

Also Read

థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం లేదు..! 

గుడికో గోమాతా.. టీటీడీ అద్భుత కార్యక్రమం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -