Wednesday, May 15, 2024
- Advertisement -

హీరోయిన్ పార్వతిని కూడా పడకగదికి రమ్మన్నారట

- Advertisement -
Actress Parvathy Reveals About her Casting Couch

సినిమాల్లో అవకాశం రావలంటే పడకగదికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అన్న నగ్నసత్యాన్నికొందరు హీరోయిన్స్ ధైర్యంగా కుండబద్ధలు కొట్టి మరి చెబుతున్నారు. కోలీవుడ్ గాయని సుచిత్ర రిలీజ్ చేసిన చేసిన కొన్ని ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది సద్దుమణగకముందే.. నటీమణులకు ఎదురయ్యే చేదు అనుభవాల గురించి కోలీవుడ్ నటీమణులు వరలక్ష్మీ శరత్ కుమార్.. సంధ్య.. కస్తూరి లాంటివారు ఇప్పటికే ధైర్యంగా గళం విప్పిన విషయం తెలిసిందే.

తమకు ఎదురైన చేదు అనుభవాల్ని ధైర్యంగా బయటపెట్టిన సదరు హీరోయిన్ల బాటనే పట్టింది కోలీవుడ్ కు పరిచయమైన మలయాళ నటి పార్వతి. ధనుష్ కు జంటగా మారియాన్.. ఆర్య.. రానా.. బాబిసింహాలతో కలిసి బెంగళూరు డేస్ చిత్రాల్లో నటించిన  ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన అందంతో.. తన నటనతో యువహృదయాల్ని కొల్లగొట్టేసింది. మలయాళంలోనూ నటిస్తున్న ఈ భామ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది.

హీరోయిన్స్ తో పరిశ్రమ ఎలా ప్రవర్తిస్తుందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆమె.. తాజాగా జరుగుతున్న ప్రచారం నిజమేనన్న పార్వతి.. చాన్స్ కావాలంటే రావాలన్నారని.. సినిమా పరిశ్రమలో ఇలాంటివి కామన్ అంటూ ఉచిత సలహా ఇచ్చారన్నారు. తాను అందుకు నో చెప్పటంతో ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పారు. తాను తక్కువ సినిమాలు చేయటానికి.. ‘బెడ్రూం’ వ్యవహారానికి నో చెప్పటమే కారణంగా చెప్పారు. పార్వతి మాటలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి.

{youtube}1LSYjMwibps{/youtube}

Related

  1. ఖైదీ మూవీ విలన్ భార్య తెలుగు స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా..?
  2. మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?
  3. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  4. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -