Monday, May 13, 2024
- Advertisement -

రఘు ఏం చదివాడు.. ఎలా కమెడియన్ అయ్యాడు..?

- Advertisement -
Comedian Raghu Life

ఏ పరిశ్రమలో అయిన… టాలెంట్ కంటే.. అదృష్టం చాలా పాళ్లు ఎక్కువ.. అందుకే చాలా మంది నటులు.. డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యా అని అంటూ ఉంటారు. అలాంటి నటుడు.. కమెడియన్ రఘు కారుమంచి.. తెలంగాణ యాసలో డైలాగులు అదరగొడ్తూ కామెడీ ఇరగతీస్తున్నాడు. ఆది మూవీతో పరిచయం అయ్యి.. అదుర్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు.

తాజాగా ఖైదీ 150 మూవీలో మరోసారి తనేంటో రుజువు చేసుకున్నాడు. పరిశ్రమలో చాలా మంది హీరోలు డిగ్రీలు కూడా కంప్లీట్ చేసి ఉండరు. మరి అలాంటిది రఘు కారుమంచి ఏం చదివాడో తెలిస్తే ఊహించలేరు. ఆయన చదివింది ఎంబీయే ఇంటర్నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. 2010లోనే చీఫ్‌ మార్కెటింగ్‌ ఇంజినీర్‌గా మంచి పొజిషన్లో ఉన్నాడు. మరి అలాంటివాడు.. మూవీస్ లోకి ఎలా వచ్చాడు. దానికి కారణం ఏంటి.. వాస్తవానికి రఘుకు నటించే ఉద్దేశమే లేదు.

అప్పట్లో దర్శకులు వీవీ వినాయక్‌, సురేందర్‌ రెడ్డి అమీర్‌పేట్‌లోని శాంతిభాగ్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవారు. అయితే వినాయక్‌, సురేందర్‌ రెడ్డి ఉండే రూం పక్కన రూంలో రఘు ఉండేవారు. అలా వీరితో రఘుకి బాగా పరిచయం ఏర్పడింది. దాంతో రఘు మాటలు.. అతన విధానం నచ్చిన.. వినాయక్‌.. తాను దర్శకత్వం వహించబోయే మొదటి మూవీలో చాన్స్ ఇస్తానని చెప్పాడట. అలా రఘుకి ఆది మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అదుర్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం మంచి కమెడియన్ గా కొనసాగుతున్నారు.

{youtube}w5DfTAu9mNM{/youtube}

Related

  1. ఎమ్మెల్యే కాబోతున్న కళ్యాణ్ రామ్.. ఎలానో తెలుసా..?
  2. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  3. చాన్స్‌లు లేక.. అమల ఎలాంటి రోల్స్ చేస్తుందో తెలుసా..?
  4. జగపతిబాబు ఆస్తి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవుతారు!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -