Sunday, May 19, 2024
- Advertisement -

అఖిల్ రెండో సినిమా ఎవరితో అంటే?

- Advertisement -

అక్కినేని అఖిల్ నటించిన మొదటి చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్కినేని అభిమానులు ఈ సినిమా చూసి నిరాశ చేందారు. ఇక అక్కినేని అభిమానులు అఖిల్ రెండో సినిమా ఎప్పుడు మొదలు పెట్టబోతున్నాడు అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.

అయితే ఇటివలే కృష్ణగాడి వీర ప్రేమ గాథ వంటి సినిమాని తీసి హిట్ కొట్టిన దర్శకుడు హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా తీయబోతున్నాడు. స్వ‌యంగా అఖిలే ఈ సంగ‌తి క‌న్ఫ‌మ్ చేశాడు. త‌న రెండో సినిమా హ‌నుతోనే అని అత‌ను ట్విట్ట‌ర్లో ప్ర‌క‌టించాడు.

హ‌నుతో క‌లిసి ఓ స్క్రిప్టు మీద ప‌ని చేస్తున్నామ‌ని.. ప్రి ప్రొడ‌క్షన్ దాదాపుగా పూర్తి కావ‌చ్చింద‌ని.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు మొద‌లుపెడ‌దామా అని ఉత్కంఠ‌గా ఉంద‌ని చెప్పాడు అఖిల్. ఆగస్టు 29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అఖిల్ రెండో సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవచ్చని తెలుస్తోంది. ఈ చిత్రం హ‌ను స్ట‌యిల్లో సాగే ల‌వ్ స్టోరీ అని స‌మాచారం.

Related

  1. అఖిల్ ఏం చేస్తున్నాడంటే?
  2. ఎవరీ అఖిల్ లవర్?
  3. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?
  4. నాగ్ కి అఖిల్ పెద్ద షాక్ ఇచ్చాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -