Friday, April 19, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ పోస్టులు అందుకే డిలీట్ చేశా

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ టీంపై బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ అసంతృప్తిగా ఉందన్న వార్తులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తన పాత్ర పరిధి మరీ తక్కువగా ఉండటంతో ఆగ్రహంతో ఉందనీ.. అందుకే ప్రమోషన్స్‌కు కూడా దూరంగా ఉందంటూ ప్రచారం జరిగింది. దీనికి తోడు గతంలో తాను షేర్ చేసిన ఆర్ఆర్ఆర్ పోస్టులను ఆలియా భట్ తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలిగించడం దుమారం రేపింది.

అంతేకాదు రాజమౌళిని అన్ పాలో చేసిందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ వ్యవహారంపై ఆలియా భట్ తాజాగా స్పందించింది. ఆర్ఆర్ఆర్ టీమ్ పై తనకు ఎలాంటి అసంతృప్తి, అసహనం లేదని స్పష్టం చేసింది. దయ చేసి ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయొద్దని కోరింది. తక్కువ పోస్టులు ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఎప్పటికప్పుడు పాత పోస్టులు, వీడియోలు తొలగిస్తానని.. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ పోస్టులను తొలిగించానని పేర్కొంది.

దీనికే ఏదేదో ఊహించుకుంటే ఎలా అని ప్రశ్నించింది. ఈ మేరకు ఓ లేఖను పోస్టు చేసింది. ఆర్ఆర్ఆర్ అనే ప్రపంచంతో తానూ భాగస్వామిని అవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. రాజమౌళి సర్‌, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి పనిచేయడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది.

బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ టాప్ హీరోయిన్

పట్టుబట్టి ఆ డైరెక్టర్ ను మార్పించిన సమంత

భారీ పరితోషకం తీసుకున్న దీపికా పదుకొణె

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -