Thursday, April 25, 2024
- Advertisement -

రాజకీయాల్లోకి యంగ్ టైగర్ వస్తున్నారా ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలం నుంచి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 2009లో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ ఆ తర్వాత పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2024 ఎన్నికల నాటికి తారక్ టీడీపీలో యాక్టివ్ అవుతారని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో యాక్టివ్ పాలిటిక్స్‌పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఘన విజయాన్ని ఆయన ఆస్వాధిస్తున్నారు.

అయితే ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన సందర్భంలో ఎన్టీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి అడుగుపెట్టానని…ప్రస్తుతం కెరీర్ ప్రారంభించి 20 ఏళ్లు అవుతోందన్నారు. హిట్, ప్లాప్ ఏది వచ్చినా.. ఆ క్షణానికే తీసుకుంటానన్నారు. ఒకసారి తప్పు జరిగితే.. మరోసారి జరగకుండా జాగ్రత్త పడతానన్నారు. తన తాతయ్య ఎన్టీఆర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. సమాజం మనకు ఎంతో ఇస్తుందని ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలన్న విషయం ఆయన్నుంచే నేర్చుకున్నానని చెప్పారు.

క్రియాశీల రాజకీయాల గురించి మాట్లాడుతూ తాను భవిష్యత్తు గురించి నమ్మననీ.. ఈ క్షణాన్ని మాత్రమే ఆస్వాధిస్తానన్నారు. నటుడిగా ప్రస్తుతం తాను ఈ ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నానని, మంచి సినిమాలు చేసుకుంటూ సంతృప్తిగా ఉన్నానని అన్నారు. అయితే ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులను నిరాశపరిచాయి.

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం

ఫిల్మ్ సిర్కిల్‌ గా చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -