ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు ఏం చెప్పాడు..?

Allari Naresh About Uday Kiran

ఉదయ్ కిరణ్.. ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. కెరీర్ ఆరంభంలో ఈ హీరోని చూసి ఎక్కడికో వెళ్లిపోతాడనుకున్నారు. కానీ సక్సెస్‌ను సరిగ్గ నిలబెట్టుకోలేక దారుణమైన స్థితికి చేరాడు. చివరికి తీవ్ర మానసిక వేదనతో ప్రాణాలే తీసుకున్నాడు. అయితే చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ చాలా బాధనే అనుభవించిన విషయం చాలా మందికి తెలియదు. అసలు అతడి గురించి ఎవరికీ పట్టింపు కూడా లేదు. ఐతే ఉదయ్ కిరణ్ ఎలా బాధపడేవాడో తనకు తెలుసంటున్నాడు అతడి మిత్రుడైన అల్లరి నరేష్.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ గురించి ఒక బాధాకర విషయం చెప్పాడు నరేష్. “చనిపోక ముందు ఒక రోజు ఉదయ్ నన్ను కలిశాడు. ఎందుకో అతని చూస్తే.. ఏదో దిగులుతో భాదపడుతున్నట్లు అనిపించింది. ఎందుకలా ఉన్నావ్ అని అడిగాను. పొద్దునే పేపర్లో ఒక ఆర్టికల్ చదివానని.. అందులో ఒక యువ కథానాయకుడు కథలు సరిగా ఎంచుకోవట్లేదని రాసి ఉన్నట్లు చెప్పాడు.

దానికెందుకు అంత బాధపడుతున్నావ్.. నీకు సంబంధించిన విషయం కాదు కదా అన్నాను. ఐతే ఆ ఆర్టికల్ వేరే హీరోకు సంబంధించిందే అయినా.. అతడు కథలు ఎంచుకోవడంలో మార్పు రాకపోతే చివరికి ఉదయ్ కిరణ్‌ గతే పడుతుంది అంటూ తనను ఉదాహరణగా చూపించారని బాధపడ్డాడు. దాంతో నాకు చాలా బాధగా అనిపించింది. ఒక నటుడు మంచి స్థాయిలో ఉన్నపుడు ఆకాశానికి ఎత్తేసిన వాళ్లే.. తర్వాత కింద పడ్డపు ఎంత చిన్నచూపు చూస్తారో ఆ సంఘటనతో తెలుసుకున్నాను. ఎలాంటి నటులు అయిన.. అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయని చాలా మందికి తెలియదు” అని ఆవేదన చెందాడు అల్లరి నరేష్.

{youtube}3ui5B2w2LXk{/youtube}

Related

  1. హీరోయిన్ సదా హాట్ వీడియో లీక్!
  2. లేడి ఆర్టిస్ట్ తో ఆ టాప్ హీరో రాసలీలలు!
  3. టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్లు ఇవే!
  4. హీరోయిన్ శృతీహాస‌న్ అడ్డంగా బుక్కైంది