ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ డైరెక్షన్లో కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారు. పవన్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్, యామిని భాస్కర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాయల సీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మొదట మార్చి 31న విడుదల చేయాలి అని ప్లాన్ చేశారు ఈ సినిమా నిర్మాత శరత్ మరార్.
అయితే ఉగాది 29 న వస్తుండడంతో.. పండుగను పురస్కరించుకొని అదే రోజు కాటమరాయుడు ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. దీపావళికి కానుకగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ భావిస్తోంది. షూటింగ్ పూర్తి కాకముందే చిత్రం శాటిలైట్ హక్కులు 15 కోట్లకు అమ్ముడు పోయి కాటమరాయుడు రికార్డు సృష్టించాడు. మరి థియేటర్లలో ఎలాంటి రికార్డు సృష్టిస్తాడో తెలుసుకోవాలి అంటే ఉగాది వరకు వేచి చూడాల్సిందే.
Related
