Friday, May 17, 2024
- Advertisement -

మరో సారి బన్నీ సరసన శృతి హాసన్

- Advertisement -

ఇటివలే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తరువాత ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకుందామా.. అని అనుకుంటున్న చిత్ర యూనిట్‌కు బన్నీ శృతి హాసన్ పేరును రికమెండ్ చేశాడట.

గతంలో బన్నీ, శృతి హాసన్ కాంబోలో రేసుగుర్రం సినిమా సూపర్ హిట్ అయ్యింది. సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తన తరువాత సినిమాలో కూడా సేమ్ సీన్ రిపీట్ చేయాలని ఆలోచిస్తున్నాడు అల్లు వారి అబ్బాయి. తనకు ఇష్టమైన నటి శృతి హాసన్‌తో చాలా కంఫర్ట్‌గా ఉంటుందని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు బన్నీ.

అందుకే రాబోయే సినిమాలో తన హీరోయిన్‌గా శృతి హాసన్ పేరును రికమెండ్ చేశాడు బన్నీ. దీనికి శృతి హాసన్ కూడా సై అనడంతో.. చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా మారిపోయారు. 

Related

  1. తమ్ముడు కోసం బన్నీ ఏం చేస్తున్నాడంటే?
  2. బన్నీ నిలబడాలంటే పవన్ ను తొక్కాల్సిందేనా?
  3. బన్నీకి మళ్లీ పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు!
  4. ఎన్టీఆర్ ని బన్నీ ఏం అన్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -