Sunday, May 19, 2024
- Advertisement -

తమ్ముడు కోసం బన్నీ ఏం చేస్తున్నాడంటే?

- Advertisement -

ఓ సినిమాకి మంచి క్రేజ్ తేవాలంటే ఏదో ఒకటి చేయాలి. అది హాట్ టాపిక్ లా ఉండాలి. ఈ విషయం అల్లు అర్జున్ కి చాలా బాగా తెలుసు. అందుకే తన తమ్ముడు అల్లు శిరీష్ కోసం ఓ పని చేయబోతున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. బన్నీ ఈ చిత్రంలో చేయడం వల్ల ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తుందని అంటున్నారు.

ఇక తన తమ్ముడు శిరీష్ కోసం మాత్రమే కాకుండా దర్శకుడు వేణు మల్లిడి మీద ఉన్న అభిమానంతో ఇలా స్పెషల్ అప్పీరియన్స్ కు ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇద్దరూ అల్లు బ్రదర్స్ తెర మీద కనబటంపై దర్శకుడు స్పెషల్ కేర్ తీసుకొని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట.

శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌ రెడ్డి, హరీష్‌ దుగ్గిశెట్టి నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంజరు లోక్‌ నాథ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

Related

  1. బన్నీ నిలబడాలంటే పవన్ ను తొక్కాల్సిందేనా?
  2. బన్నీకి మళ్లీ పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు!
  3. బన్నీ దొంగ లెక్కలు చూపించాడా?
  4. ఎన్టీఆర్ ని బన్నీ ఏం అన్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -