Monday, April 29, 2024
- Advertisement -

బీజేపీ సినీ మంత్రం.. ఎందుకోమరి?

- Advertisement -

జాతీయ పార్టీగా బీజేపీకి నార్త్ లో తిరుగులేని ఇమేజ్ ఉన్నప్పటికి.. సౌత్ లో మాత్రం చతికిల పడుతూనే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అందులోనూ అంధప్రదేశ్ లో కాషాయ పార్టీ ఊసే లేదు. గత ఎన్నికల ముందువరకు తెలంగాణలో కూడా బీజేపీ పరిస్థితి దారుణంగానే ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో బలమైన రైజింగ్ పార్టీగా ఎదిగింది. ఇక ఏపీలో మాత్రం ఎక్కా వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది కాషాయ పార్టీ పరిస్థితి. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికి చాటుకోవాలంటే అంతా ఈజీ కాదు. అందుకే ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది మోడి అమిత్ షా ద్వయం. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ఏపీలో పార్టీ బలోపేతం కోసం వ్యూహాలు రచిస్తోంది బీజేపీ అధిష్టానం. .

అందులో భాగంగానే పార్టీ ఏపీలో జీవం పోసుకోవాలంటే సినీ మంత్రం ఎక్కటే మార్గం అని భావించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మద్య కాలంలో టాలీవుడ్ కి బీజేపీకి మద్య సఖ్యత బాగా పెరిగింది. ఏపీలో ఇప్పటికే సినీ స్టార్ జనసేన అధ్యక్షుడు పవన్ తో పొత్తులో ఉంది బీజేపీ. పవన్ను విడిచిపెట్టే సమస్యే లేదని ఇప్పటికే పదే పదే చెబుతున్నారు కమలనాథులు. ఇక ఆ మద్య జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావడం కూడా రాజకీయ వ్యూహమేనని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక జెపి నడ్డా కూడా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి అత్యున్నత ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ ప్రకటించడం వెనుక కూడా బీజేపీ హస్తం ఉందనేది భహిర్గతం కానీ రహస్యం.

మరి ఒక్కసారిగా బీజేపీ తెలుగు సినీ హీరోలవైపు చూడడానికి కారణం ఏంటి ? వచ్చే ఎన్నికల్లో తెలుగు హీరోలను ప్రచార అస్త్రంగా వాడుకోనుందా ? అనే ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ తారలవైపు బీజేపీ చూడానికి కారణం కూడా లేకపోలేదు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీ.. అనుకోసం ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టె అవకాశం ఉంది. సినీతారాలతో ప్రచారం చేస్తే చాలా ఈజీగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతో పార్టీకి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆంధ్రలో కూడా సినీ తరాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. మరి బీజేపీ వల్లిస్తున్న ఈ సినీమంత్రం ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగ పడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

వెన్నుపోటుతో కాదు.. స్వశక్తితో వచ్చా!

బాబుకు మోడీ పిలుపు.. కారణం ఆదేనా ?

పవన్ ప్లాన్ అదుర్స్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -